న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నేడు జరుగుతున్న 4వ విడత పోలింగ్‌లో పోలింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి ఉదయం 11 గంటల వరకు మొత్తం 17.57 శాతం పోలింగ్ నమోదైనట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రస్తుతం అందుబాటులో వున్న గణాంకాల ప్రకారం వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటిగా పేరున్న జార్ఖండ్‌లోనే అధిక పోలింగ్ శాతం నమోదు కాగా దేశ వాణిజ్య రాజధానిగా పేరున్న ముంబై రాజధానిగా వున్న మహారాష్ట్రలోనే తక్కువ పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌లోనూ అత్యల్ప పోలింగ్ శాతం నమోదైనట్టు కనిపిస్తున్నప్పటికీ, అక్కడ అనంతనాగ్ అనే ఒకే ఒక్క లోక్ సభ స్థానానికి ఓటింగ్ జరుగుతుండటం.. అందులోనూ కేవలం ఆ ఒక్క స్థానానికే మూడు విడతల్లో పోలింగ్ జరుగుతుండటం అనేది అందుకు ఓ కారణమైంది. కడపటి వార్తలు అందే సమయానికి రాష్ట్రాల వారీగా ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీహార్: 15.54%


మధ్యప్రదేశ్: 20.48%


మహారాష్ట్ర: 9.90%


జమ్మూకశ్మీర్: 3.74%


జార్ఖండ్: 28.21%


రాజస్థాన్: 19.61%


ఉత్తర్ ప్రదేశ్: 19.70%


పశ్చిమ బెంగాల్: 26.72%


ఒడిషా: 14.15%


సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి వెలువడే పూర్తి స్థాయి గణాంకాలు ఏ విధంగా ఉండనున్నాయో వేచిచూడాల్సిందే మరి.