రాహుల్ గాంధీకి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్‌ ఊహించని షాక్ ఇచ్చింది. ఇంగ్లీష్ డిక్షనరిలో ఓ కొత్త పదం వచ్చిచేరింది చూడండి అంటూ ఇంగ్లీష్ లో modilie అని టైప్ చేయగా వచ్చిన ఓ ఫలితానికి సంబంధించిన స్నాప్‌షాట్‌ని రాహుల్ గాంధీ ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పదానికి అర్థం నిజాలను అవాస్తవాలుగా చూపించడం, నిరంతరం అవాస్తవాలు చెప్పేవాడు అని ఆ స్నాప్‌షాట్‌లో రాసి వుంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


అయితే, సరిగ్గా ఇదే విషయమై రాహుల్ చేసిన ట్వీట్‌కి ట్విటర్ ద్వారానే స్పందించిన ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్.. తమ డిక్షనరిలో అసలు Modilie అనే పదమే లేదని తేల్చిచెప్పింది. అంతేకాకుండా ఆ స్నాప్‌షాట్‌లో చూపించింది కూడా అవాస్తవమేనని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్ స్పష్టంచేసింది.