Oxygen tank leaked: నాసిక్‌లో ఆక్సీజన్ ట్యాంకర్ లీక్.. 22 మంది కరోనా రోగులు మృతి
Oxygen tank leaked at Zaki Hussain Hospital in Nashik: నాశిక్: మహారాష్ట్రలోని నాశిక్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాశిక్‌లోని జకి హుస్సేన్ హాస్పిటల్ వద్ద పేషెంట్స్‌కి ఆక్సీజన్ అందించే ఏర్పాట్లు చేస్తుండగా ఆక్సీజన్ ట్యాంకర్ లీక్ అవగా.. ఈ ఘటనలో ఆస్పత్రి ఐసీయూలో ఆక్సీజన్‌పై (Oxygen crisis) చికిత్స పొందుతున్న వారిలో 22 మంది కొవిడ్-19 పేషెంట్స్ ప్రాణాలు కోల్పోయినట్టు జిల్లా కలెక్టర్ సూరజ్ మందరె పీటీఐకి తెలిపారు.
Oxygen tanker leaked at Zaki Hussain Hospital in Nashik: నాశిక్: మహారాష్ట్రలోని నాశిక్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాశిక్‌లోని జకి హుస్సేన్ హాస్పిటల్ వద్ద పేషెంట్స్‌కి ఆక్సీజన్ అందించే ఏర్పాట్లు చేస్తుండగా ఆక్సీజన్ ట్యాంకర్ లీక్ అవగా.. ఈ ఘటనలో ఆస్పత్రి ఐసీయూలో ఆక్సీజన్‌పై (Oxygen crisis) చికిత్స పొందుతున్న వారిలో 22 మంది కొవిడ్-19 పేషెంట్స్ ప్రాణాలు కోల్పోయినట్టు జిల్లా కలెక్టర్ సూరజ్ మందరె పీటీఐకి తెలిపారు. మృతులంతా వెంటిలేటర్‌పై లేదా ఆక్సీజన్ సహాయంతో లైఫ్ సపోర్ట్‌పై చికిత్స పొందుతున్న వారే కావడంతో వారికి ఆక్సీజన్ అందక ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
Also read : Covisheild Vaccine Price: కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలు ప్రకటించిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
నాశిక్ మున్సిపల్ కార్పొరేషన్ (Nashik Municipal Corporation) పరిధిలో జకీ హుస్సేన్ ఆస్పత్రిని కొవిడ్-19 ఆస్పత్రిగా ప్రకటించి కొవిడ్-19 రోగులకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. అందులో మొత్తం 150 మంది పేషెంట్స్ వరకు వెంటిలేటర్స్ లేదా ఆక్సీజన్ సపోర్ట్ (Oxygen suppliers contacts) పైనే చికిత్స పొందుతున్నారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చకుండా నాశిక్ మునిసిపాలిటీ పరిధిలో ఎక్కడైతే ఆక్సీజన్‌తో ఎక్కువ అవసరం లేదో.. అక్కడి నుంచి జకీ హుస్సేన్ హాస్పిటల్‌కి ఆక్సీజన్ సిలిండర్స్ తరలించినట్టు జిల్లా కలెక్టర్ సూరజ్ తెలిపారు.
తొలుత ఈ ఘటనలో 11 మంది చనిపోయినట్టు మహారాష్ట్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే వెల్లడించారు. అయితే, ఆ తర్వాత మృతుల సంఖ్య 22కి చేరినట్టు నాశిక్ జిల్లా కలెక్టర్ సూరజ్ స్పష్టంచేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also read : Corona Second Wave: ఇండియాలో ప్రమాదకర స్థాయి దాటేసిన కరోనా కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook