Corona Second Wave: ఇండియాలో ప్రమాదకర స్థాయి దాటేసిన కరోనా కేసులు

Corona Second Wave: దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. భయంకరమై విస్తరిస్తోంది. భారీగా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో రోజువారీ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. గత 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డు కేసులు నమోదయ్యాయి. ఎన్ని కేసులంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 21, 2021, 12:07 PM IST
Corona Second Wave: ఇండియాలో ప్రమాదకర స్థాయి దాటేసిన కరోనా కేసులు

Corona Second Wave: దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. భయంకరమై విస్తరిస్తోంది. భారీగా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో రోజువారీ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. గత 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డు కేసులు నమోదయ్యాయి. ఎన్ని కేసులంటే..

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ విస్తరించేసింది. అటు కేసుల సంఖ్య ఇటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. మూడ్రోజుల క్రితం 2 లక్షల 73 వేల కేసులతో సంచలనం రేపిన కరోనా కొత్త కేసులు ఇప్పుడు అంతకంటే ఎక్కువ నమోదయ్యాయి. ఏకంగా 3 లక్షలకు చేరువలో వచ్చేశాయి. గత 24 గంటల్లో ఇండియాలో 2 లక్షల 95 వేల 41 కరోనా కేసులు ( India Corona cases) నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు కరోనా వైరస్ కారణంగా 2 వేల 23 మంది దేశవ్యాప్తంగా మరణించారు.1 లక్షా 67 వేల 457 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

దేశంలో కరోనా యాక్టివ్‌ కేసులు 21 లక్షలు దాటాయి. దేశంలో ప్రస్తుతం 21 లక్షల 57 వేల 538 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1 కోటి 56 లక్షల 16 వేల 130 కరోనా కేసులు నమోదు కాగా..కరోనా నుంచి మొత్తం 1 కోటి 32 లక్షల 76 వేల 39 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో మొత్తం 1 లక్షా 82 వేల 553 మంది మృతి చెందారు. మరోవైపు దేశంలో 13 కోట్ల 1 లక్షా 19 వేల 310 మందికి కరోనా వ్యాక్సిన్ ( Corona vaccination) అందించారు. అటు తెలంగాణలో కూడా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 6 వేల 542 కొత్త కేసులు నమోదయ్యాయి. 

Also read: PM Modi speech key points: కరోనా, Lockdown ను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ కీలక సూచనలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News