Rahul Bajaj Passed away at 83: ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్‌ గ్రూప్ మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్ (Rahul Bajaj) (83) ఇవాళ కన్నుమూశారు. ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు బజాజ్ గ్రూప్ (bajaj group) ఓ ప్రకటనలో తెలిపింది. గత కొన్ని రోజులుగా ఆయన న్యుమోనియా, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. రాహుల్ బజాజ్ అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూన్ 10, 1938న జన్మించారు రాహుల్ బజాజ్. 1965లో బజాజ్‌ గ్రూప్‌ బాధ్యతలను చేపట్టారు. 40 ఏళ్లకు పైగా ఛైర్మన్‌గా వ్యవహరించారు. గతేడాది ఏప్రిల్‌లో బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన గౌరవ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2001లో రాహుల్ బజాజ్‌కు దేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ (Padma Bhushan) లభించింది. బజాజ్ రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు.


ఫిబ్రవరి 2021 ప్రకారం, రాహుల్ బజాజ్ 8.2 బిలియన్ డాలర్ల నికర విలువతో ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 421వ స్థానంలో నిలిచారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ..ట్వీట్స్ చేస్తున్నారు. 




Also Read: Hijab Row: ఇది మా అంతర్గత వ్యవహారం.. హిజాబ్ వివాదంపై పాక్‌, అమెరికాకు భారత్ కౌంటర్




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి