IAF జరిపిన Balakot Air strikes దాడుల్లో 300 మంది మృతి అనేది ఓ Fake news కథనం
Fact check about 300 dead in Balakot Air strikes : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దులు దాటుకుని వెళ్లి మరీ జరిపిన Balakot Air strikes లో పాకిస్తాన్‌కి చెందిన 300 మంది ఉగ్రవాదులు చనిపోయారని ఒక టీవీ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త Zafar Hilaly అంగీకరించినట్టుగా ప్రముఖ వార్తా సంస్థ ANI Digital విభాగం వెల్లడించడంతో ఆ వార్త భారతీయ మీడియాలో వైరల్‌గా మారింది.
Fact check about 300 dead in Balakot Air strikes : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దులు దాటుకుని వెళ్లి మరీ జరిపిన Balakot Air strikes లో పాకిస్తాన్‌కి చెందిన 300 మంది ఉగ్రవాదులు చనిపోయారని ఒక టీవీ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త Zafar Hilaly అంగీకరించినట్టుగా ప్రముఖ వార్తా సంస్థ ANI Digital విభాగం వెల్లడించడంతో ఆ వార్తా భారతీయ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే నిజం అనుకున్న మీడియా సంస్థలు అనేక కథనాలు రాసుకున్నాయి. ఈ వార్తపై కథనాలు రాసుకున్న మీడియా సంస్థల్లో అనేక ప్రాంతీయ మీడియా సంస్థలతో పాటు ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు కూడా ఉన్నాయి.
అయితే వాస్తవానికి ఇది ఓ ఫేక్ న్యూస్ కథనం అని ఆ తర్వాత factly.in జరిపిన ఫ్యాక్ట్ చెక్ పరిశోధనలో తేటతెల్లమైంది. ఏఎన్ఐ సైతం ఆ తర్వాత తమ ట్వీట్స్‌ని, కథనాన్ని డిలీట్ చేసింది. జాఫర్ హిలాలి కూడా దీనిపై స్పందిస్తూ పలు ట్వీట్స్ చేశారు. తాను చెప్పింది ఒకటైతే... భారతీయ మీడియాలో వైరల్‌గా మారింది మరొకటి అంటూ జాఫర్ హిలాలి తన ట్వీట్స్‌లో పేర్కొన్నారు.
IAF జరిపిన వైమానిక దాడిలో 300 మంది చనిపోయారని తాను చెప్పలేదని... కానీ తన వీడియోను ఎడిట్ చేయడం ద్వారా తాను చెప్పని విషయాన్ని కూడా చెప్పినట్టుగా చిత్రీకరించారని జాఫర్ హిలాలి స్పష్టంచేశారు.
Also read : Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తెను రెండు సార్లు మోసం చేశారు, అసలేం జరిగిందంటే
తన ఒరిజినల్ వీడియోను ఎడిట్ చేసి తన అభిప్రాయాన్ని తప్పుదోవ పట్టించారని భారతీయ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై జాఫర్ హిలాలి అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా Balakot Air strikes లో 300 మంది Pakistan terrorists చనిపోయారని జాఫర్ హిలాలి చెప్పారనే వార్తల్లో నిజం లేదని రుజువైంది. నిజాలు వెల్లడైన నేపథ్యంలో సామాజిక బాధ్యతతో ఈ వార్తా కథనాన్ని అప్‌డేట్ చేయడం జరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook