Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తెను రెండు సార్లు మోసం చేశారు, అసలేం జరిగిందంటే

Delhi CM Arvind Kejriwals Daughter Duped: సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, చివరకు ముఖ్యమంత్రి కుమార్తెను సైతం బురిడీ కొట్టించారు నేరగాళ్లు. ఒకే విషయంలో రెండు పర్యాయాలు ఆమెను మోసగించడం గమనార్హం. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 9, 2021, 12:12 PM IST
  • ఆమ్ ఆద్మీ పార్టీ కన్వినర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత
  • ఆన్‌లైన్ వేదికగా ఏకంగా సీఎం కుమార్తెను టార్గెట్ చేసిన నేరగాళ్లు
  • ఒకే విషయంపై ఈకామర్స్ వెబ్‌సైట్‌లో రెండు సార్లు మోసపోయిన హర్షిత
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తెను రెండు సార్లు మోసం చేశారు, అసలేం జరిగిందంటే

Delhi CM Arvind Kejriwals Daughter Duped: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వినర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తెకు సైబర్ నేరగాళ్లు షాకిచ్చారు. సీఎం కేజ్రీవాల్ కుమార్తె హర్షితను ఈకామర్స్ వెబ్‌సైట్‌తో బురిడీ కొట్టించారు. హర్షిత నుంచి రెండు సార్లు ఆన్‌లైన్ మాద్యమంలోనే డబ్బులు కొట్టేశారు.

 

అసలేం జరిగిందంటే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) కుమార్తె హర్షిత ఇ-కామర్స్‌ వేదిక ‘ఓఎల్‌ఎక్స్‌’లో ఓ సోఫాను అమ్మకానికి పెట్టారు. ఆ సోఫా తనకు నచ్చిందని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓ వ్యక్తి ఆమెను నమ్మించాడు. సోఫా కొనుగోలు చేసేందుకు హర్షిత బ్యాంకు వివరాలు సైతం అతడు సేకరించాడు. హర్షిత బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ చేశానని నమ్మించాడు. 

Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో స్థిరంగా బంగారం ధరలు, భారీగా పెరిగిన Silver Price

 

ఈ మేరకు ఆమెకు ఓ క్యూఆర్ కోడ్ పంపినట్లు చెప్పి, స్కాన్ చేయగా హర్షిత ఖాతాకు నగదు చేరుతుందని చెప్పాడు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే హర్షిత ఖాతా నుంచి రూ.20 వేలు మాయమయ్యాయి. అడడ్ని అడగితే పొరపాటున వేరే కోడ్ పంపానంటూ మరో క్యూఆర్ కోడ్ పంపించాడు. అది స్కాన్ చేయగా మరో రూ.14వేలు సైతం హర్షిత ఖాతా నుంచి బదిలీ అయ్యాయి. ఫిర్యాదు అందుకున్న ఢిల్లీ(New Delhi) పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Also Read: EPFO: జాబ్ మానేసిన ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్, ఇకనుంచి పాత కంపెనీతో పనిలేదు 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News