'కరోనా వైరస్' కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలీసులు ఏం చేస్తారు.? అదేం  ప్రశ్న అంటారా..? రోడ్లపై పహారా కాస్తారు. కరోనా వైరస్ లాక్ డౌన్ ఉంది కాబట్టి ఎవరూ నిబంధనలు ఉల్లంఘించకుండా చూస్తారు. బయటకు వచ్చిన వారిని ఇళ్లకు వెళ్లమని చెబుతారు. అని ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు. కానీ హరియాణాలోని పంచకుల పోలీసులు మాత్రం ఆశ్చర్యకరమైన పని చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా చూస్తున్నపోలీసులు.. పంచకులలోని ఓ వృద్ధునికి సర్ప్రైజ్ ఇచ్చారు. పంచకుల సెక్టార్ 7లో కరన్ పురి అనే వృద్ధుడు నివసిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు. పదుల సంఖ్యలో పోలీసులు తన ఇంటికి రావడంతో వృద్ధుడు కరన్ పురి ఆశ్చర్యపోయారు. కరోనా వైరస్ సోకిందనే ఉద్దేశ్యంతో తనను తీసుకు వెళ్లడానికి వస్తున్నారని భావించారు. తాను అస్సలు బయటకు వెళ్లడం లేదని.. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించలేదని ఇంట్లో నుంచి బయటకు వస్తూనే పోలీసులకు చెబుతూ వచ్చారాయన. ఐతే గేటు  వద్దకు రాగానే ఒక్కసారిగా హ్యాపీ బర్త్ డే అంకుల్ ..  అంటూ పోలీసులు రాగం అందుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు కరన్ పురి. ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తనకు బర్త్ డే విషెష్ చెప్పిన పోలీసులతో కలిసి కేక్ కట్ చేశారు.



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..