Parliament: శీతాకాల సమావేశాలు రద్దు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కరోనావైరస్ (coronavirus) మహమ్మారి కారణంగా ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించడం లేదని (Central government) స్పష్టం చేసింది.
Parliament Winter Session: న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కరోనావైరస్ (coronavirus) మహమ్మారి కారణంగా ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించడం లేదని (Central government) స్పష్టం చేసింది. అయితే బడ్జెట్ సమావేశాలను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించడమే మంచిదని భావిస్తున్నట్లు కేంద్రం అభిప్రాయపడింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi ).. లోక్‌సభ కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరికి లేఖ రాశారు. శీతాకాలంలో కరోనావైరస్ (Covid-19) విజృంభిస్తోందని.. ముఖ్యంగా ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు.
త్వరలో కరోనా వ్యాక్సిన్ రానుందని.. ఈ నేపధ్యంలో శీతాకాల సమావేశాల ( Parliament ) రద్దుకు అన్ని రాజకీయ పార్టీలు మొగ్గు చూపాయని ప్రహ్లాద్ జోషి వివరించారు. ఈ విషయంపై ఇప్పటికీ అన్ని పార్టీల నేతలతో మాట్లాడానన్నారు. దీంతో బడ్జెట్ సమావేశాలు జనవరిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. అయితే దీనిపై తమను సంప్రదించలేదని కాంగ్రెస్ (Congress) ఆగ్రహం వ్యక్తంచేసింది. Also read: AAP: యూపీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ: కేజ్రీవాల్ కీలక నిర్ణయం
వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ( farm laws ) చర్చించడానికి శీతాకాల సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ముందుగా లోక్‌సభ కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) లేఖ రాశారు. ఆ చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని.. దీనికోసం సమావేశాలను ఏర్పాటు చేయాలని అధిర్ కోరారు. దీనికి జోషి సమాధానమిస్తూ.. కరోనా కారణంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించడం లేదని ఉహగానాలకు తెరదించారు. దీనికి అధిర్ రంజన్ చౌదరి బదులిస్తూ.. తీవ్రమైన చలిలో రైతులు నిరసన తెలుపుతున్నారని.. ఇది దేశ ప్రతిష్టకు మంచిది కాదన్నారు. రైతుల నిరసనతో కేంద్ర ప్రభుత్వం గందరగోళంలో పడిందని ఆయన విమర్శించారు. Also read: Fact Check: రజనీ కాంత్ పార్టీ పేరు, గుర్తు ఆటో..ఏది నిజం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe