Fact Check: రజనీ కాంత్ పార్టీ పేరు, గుర్తు ఆటో..ఏది నిజం

Fact Check : తమిళనాట ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్  పార్టీ పేరేంటి..గుర్తేంటి. ఈ విషయంలో  వివిధ రకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. అన్ని ఊహాగానాలపై రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు.

Last Updated : Dec 15, 2020, 09:11 PM IST
Fact Check: రజనీ కాంత్ పార్టీ పేరు, గుర్తు ఆటో..ఏది నిజం

Fact Check : తమిళనాట ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్  పార్టీ పేరేంటి..గుర్తేంటి. ఈ విషయంలో  వివిధ రకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. అన్ని ఊహాగానాలపై రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు.

తమిళనాట ( Tamil nadu ) మరో రాజకీయ పార్టీ రాబోతుంది. ప్రముఖ నటుడు సూపర్ స్టార్ ( Super star ) రజనీ కాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఇటీవలే కీలకమైన ప్రకటన చేశారు. జనవరిలో కొత్త పార్టీ స్థాపించబోతున్నానని..పార్టీ వివరాల్ని డిసెంబర్ 31న ప్రకటిస్తానని కూడా తెలిపారు. పార్టీ ఏర్పాట్లను ఇటీవల వేగవంతం చేశారు. ముఖ్య నేతలు, అభిమానులతో రెండు సార్లు సమావేశమయ్యారు. 2021 అంటే వచ్చే యేడాది జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నామని కూడా రజనీ కాంత్ ( Rajinikanth ) స్పష్టం చేశారు. 

ఈ నేపధ్యంలో రజనీకాంత్ పెట్టబోతున్న పార్టీ పేరు, గుర్తు ( party name and symbol ) వంటివాటిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమైంది. రజనీకాంత్ పార్టీ పేరు మక్కల్ సేవై కట్చి అని...ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిందనే ప్రచారం అందుకుంది. మరోవైపు పార్టీకి ఆటో గుర్తు ( Auto symbol ) కేటాయించినట్టు కూడా వార్తలు మొదలయ్యాయి. రజనీకాంత్ నటించిన బాషా చిత్రానికి సంబంధించి నే ఆటోవాణ్ణి ఆటోవాణ్ణి అనే పాటను ఆధారం చేసుకుని కధనాలు కూడా ప్రారంభమయ్యాయి.

ఆ నోటా ఈ నోటా ఈ ప్రచారం రజనీకాంత్ చెవిన కూడా పడినట్టుంది. ప్రచారంలో ఉన్న ఊహాగానాలన్నీ తప్పని..డిసెంబర్ 31 లేదా జనవరిలోనే ప్రకటిస్తానన్నారు. రజనీ కాంత్ చేసిన ప్రకటనతో సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు ఇకనైనా తెరపడుతుందేమో చూడాలి.

Also read: AAP: యూపీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ: కేజ్రీవాల్ కీలక నిర్ణయం

Trending News