Parliament Winter Session: పార్లమెంట్ వింటర్ సెషన్ త్వరలో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు పూర్తయిన కొన్నిరోజులకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది కేంద్రం. క్రిస్మస్‌కు ముందే ఈ సమావేశాలు ముగియనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మూడు కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అందుకే డిసెంబర్ రెండవ వారంలో వింటర్ సెషన్ ప్రారంభించి క్రిస్మస్‌కు ముందు ముగించనున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్ని కనీసం 12 రోజులు నిర్వహించేలా షెడ్యూల్ దాదాపుగా ఖరారైనట్టు సమాచారం. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ఠ్ స్థానంలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టేనుంది. ఇప్పటికే వీటిని కేంద్ర హోంశాఖ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఎలక్షన్ కమీషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును గత వర్షాకాల సమావేశాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేసినా విపక్షాల, మాజీ ఎన్నికల కమీషనర్ల వ్యతిరేకతతో కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఎలక్షన్ కమీషనర్ల హోదాను కేబినెట్ కార్యదర్శికి సమానంగా తీసుకురావాలనేది ఈ బిల్లు ఉద్దేశ్యం. 


దాంతోపాటు ఎన్నికల కమీషనర్ల నియామక విధానంలో కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కమీషనర్లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా ఉంది. ఈ బిల్లు ఆమోదిస్తే కేబినెట్ సెక్రటరీ హోదా లభిస్తుంది. 


Also read: Delhi Pollution: ప్రమాదకరంగా ఢిల్లీ కాలుష్యం, స్కూళ్లకు ముందే వింటర్ సెలవులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook