పాస్ పోర్టు నిబంధనలు సడలింపు !
పాస్ పోర్టు దరఖాస్తు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. వృద్ధులు, వికలాంగులు, చిన్నారులతో పాటు అద్దింట్లో నివసించే వారికి కొన్ని వెసులుబాట్లు కల్పించింది. 60 ఏళ్లు నిండిన వాళ్లు, వికలాంగులు చిన్నారులు ఇకపై ముందస్తు స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సాధారణ క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. ఈ కేటరిగి వారు తమ దరఖాస్తులు, సంబంధిత ధృవీకరణ పత్రాలతో నేరుగా వాక్‌ఇన్ ఇంటర్వూలకు వెళ్లిపోవచ్చు.
వికలాంగులు, ఐదేళ్ల లోపు చిన్నారులు వేలి ముద్రలను ఇవ్వాల్సిన నిబంధన మినహాయింపు ఇచ్చారు. అలాగే అద్దె ఇళ్లలో ఉండే వారు నివాస ధ్రువీకరణ కింద సంబధిత రెంటల్ అగ్రిమెంట్ ఇస్తే సరిపోతుంది.. నిబంధనల సడలింపుతో సామాన్య ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తున్నారు.