కాంగ్రెస్ పాలనతో పోలిస్తే తమ హయాంలో పెట్రోల్, డీజిల్ రేట్లు తక్కువగా ఉన్నాయని చెప్పేందుకు బీజేపీ కేంద్ర కార్యాలయం ఓ ట్వీట్ చేసింది. అందులో కాంగ్రెస్ హయాంలో, బీజేపీ హయాంలో పెట్రోల్, డీజిల్ రేట్లను గ్రాఫ్స్ రూపంలో చెప్పింది. యూపీఏ శకంలో పెట్రోలు, డీజిల్ ఖరీదైనవని.. బీజేపీ తన పాలనలో పెట్రోలు, డీజిల్ ధరలను నియంత్రించిందని పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ కేంద్ర కార్యాలయం ట్వీట్ ప్రకారం.. యుపిఎ నేతృత్వంలోని యూపీఏ1, యూపీఏ2 హయాంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. యూపీఏ1 హయాంలో 16 మే 2014 నుండి 16 మే 2009 మధ్యకాలంలో 20.5 శాతం పెట్రోల్ ధరలు పెరిగాయి. ధర రూ.33.71 నుండి రూ.40.62కి పెట్రోల్ పెరిగింది. యూపీఏ2 ప్రభుత్వ హయాంలో 16 మే 2009 నుండి 16 మే 2014 మధ్యకాలంలో 75.8 శాతం పెట్రోల్ ధరలు పెరిగాయి. ధర రూ .40.62 నుండి రూ .71.41కి పెట్రోల్ పెరిగింది. బీజేపీ పాలనలో మే 16, 2014 నుండి  10 సెప్టెంబరు 2018 వరకు పెట్రోల్ ధరలు 13 శాతమే పెరిగాయి. పెట్రోల్ ధర రూ .71.41 నుంచి రూ. 80.73కి పెరిగింది.



 


యుపిఎ నేతృత్వంలోని యూపీఏ1, యూపీఏ2 హయాంలో డీజిల్ ధరలూ భారీగా పెరిగాయి. యూపీఏ1 హయాంలో 16 మే 2014 నుండి 16 మే 2009 మధ్యకాలంలో 42 శాతం డీజిల్ ధరలు పెరిగాయి. ధర రూ.21.74 నుండి రూ.30.86కి డీజిల్ పెరిగింది.  యూపీఏ2 ప్రభుత్వ హయాంలో 16 మే 2009 నుండి 16 మే 2014 మధ్యకాలంలో 83.7 శాతం డీజిల్ ధరలు పెరిగాయి. ధర రూ .30.86 నుండి రూ .56.71కి డీజిల్  పెరిగింది. బీజేపీ పాలనలో మే 16, 2014 నుండి  10 సెప్టెంబరు 2018 వరకు డీజిల్  ధరలు 28 శాతమే పెరిగాయి. పెట్రోల్ ధర రూ .56.71 నుంచి రూ. 72.83 కి పెరిగింది.



 


అయితే రూ.56.71తో పోలిస్తే రూ.72.83 ధర 28 శాతం తక్కువని చూపిస్తూ బాణం గుర్తు గీయడం, రూ.71.41తో పోలిస్తే రూ.80.73 ధర 13 శాతం తక్కువని చూపిస్తూ బాణం గుర్తు గీయడం అభాసుపాలు చేసింది. ఈ గ్రాఫ్ ను చూసిన నెటిజన్లు బీజేపీకి లెక్కలు కూడా రావని విమర్శిస్తున్నారు.


అటు పెట్రో ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. తాజా మార్పులతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.80.73కు చేరగా.. డీజిల్‌ ధర రూ.72.83గా ఉంది. కాగా, పెట్రోల్‌ ధరలపై పరిష్కారం తమ చేతుల్లో లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఒపెక్‌ వల్లే పెట్రో ధరలు భగ్గుమంటున్నాయని కేంద్రం పేర్కొంది.