న్యూఢిల్లీ: పెట్రోల్‌ ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయ్. 37 రోజుల అనంతరం పెట్రోల్‌ ధరలను చమురు సంస్థలు గురువారం నుంచి పెంచుతూ వస్తున్న సంగతి తెలిసిందే. శనివారం కూడా లీటర్ ‌పెట్రోల్‌పై 13పైసలు, డీజిల్‌పై 10పైసలు పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ఐఓసీ,హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌లు తెలిపాయి. దీంతో శనివారం నాటికి లీటర్‌ పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ. 75.98, ముంబయిలో రూ.83.37, కోల్‌కతాలో రూ.78.66, చెన్నైలో రూ.78.85, హైదరాబాద్‌లో రూ.80.35కు చేరుకుంది. లీటర్‌ డీజిల్‌10పైసలు పెరిగి ఢిల్లీలో రూ.67.76, ముంబయిలో రూ.71.90, కోల్‌కతాలో రూ. 70.31, చెన్నైలో రూ.71.52, అత్యధికంగా హైదరాబాద్‌లో రూ. 73.54కు చేరింది. పెట్రోల్‌ ధరలు చివరిసారిగా జూన్‌ 26న తగ్గి.. జులై 5వరకు యథావిథిగా ఉంచిన చమురు కంపెనీలు తొలిసారి గురువారం పెంచాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చమురు ధరల తగ్గింపునకు కేంద్రం చర్యలు


చమురు ధరల పెంపుపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుండడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఫ్యుచర్స్ ట్రేడింగ్, ఒపెక్ నుంచి రాయితీ, ఓఎన్జీసీతో చర్చించడంతో పాటు.. పెట్రో ఉత్పత్తులను దశల వారీగా జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఆదియా తెలిపారు. కాగా తొలిదశలో నేచురల్ గ్యాస్, విమాన ఇంధనాలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉంది.