PF Account Alert: మీ బేసిక్ జీతం 20 వేలా..అయితే రిటైర్మెంట్కు మీ సంపాదన 2 కోట్ల పైనే
PF Account Alert: మీ బేసిక్ శాలరీ 20 వేల రూపాయలుందా..అయితే కచ్చితంగా 2 కోట్ల 80 లక్షల వరకూ సంపాదించవచ్చు. అది కూడా పీఎఫ్ రూపంలో. ఆశ్చర్యంగా ఉందా. అదెలాగో తెలుసుకుందాం.
PF Account Alert: మీ బేసిక్ శాలరీ 20 వేల రూపాయలుందా..అయితే కచ్చితంగా 2 కోట్ల 80 లక్షల వరకూ సంపాదించవచ్చు. అది కూడా పీఎఫ్ రూపంలో. ఆశ్చర్యంగా ఉందా. అదెలాగో తెలుసుకుందాం.
ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ అంటే ఈపీఎఫ్ఓలో (EPFO) మీకు ఎక్కౌంట్ ఉంటే ఈ వార్త మీ కోసమే. భవిష్యత్ సంరక్షణ కోసం చాలామంది వివిధ మార్గాల్లో పెట్టుబడి పెడుతుంటారు. వృద్ధాప్యంలో అంటే రిటైర్మెంట్ అనంతరం సెక్యూరిటీ కోసం ఇలా చేస్తుంటారు. అయితే వేరే చోట్ల పెట్టుబడి పెట్టాలనే ఆలోచన లేకపోతే..ఈపీఎఫ్ అద్భుతమైన అవకాశంగా ఉంది. మీ శాలరీ నుంచి కొంతభాగం ఈపీఎఫ్‌లో ప్రతి నెలా పెట్టుబడిగా పెడితే రిటైర్మెంట్ అనంతరం పెద్దమొత్తంలో డబ్బులు అందుకోవచ్చు.
ఎక్స్‌పర్ట్స్ చెప్పినదాని ప్రకారం..మీ బేసిక్ శాలరీ (Basic Salary)20 వేల రూపాయలై ఉండి..25 ఏళ్ల వయస్సు నుంచి 24 శాతం ఈపీఎఫ్ కట్ అవుతుంటే నెలకు 4 వేల 8 వందల రూపాయలు ప్రతి నెలా డిడక్షన్ ఉంటుంది. ఇలా 25 ఏళ్లపాటు పెట్టుబడి పెడితే...మీ రిటైర్మెంట్ సమయానికి కార్పస్ ఫండ్‌గా 2 కోట్ల 79 లక్షల రూపాయలు చేతికి అందుతాయి. అదెలాగో సులభమైన మార్గంలో తెలుసుకుందాం.
రిటైర్మెంట్ ఫండ్ ఎలా ఉంటుంది
పీఎఫ్ ఎక్కౌంట్‌పై (PF Account)మీకు 8.5 శాతం వడ్డీ లభిస్తుంది. 7 శాతం శాలరీ హైక్ పరిశీలనలో తీసుకుంటే..25 ఏళ్ల వయస్సులో మీ పీఎఫ్ పెట్టుబడి ప్రారంభమైతే రిటైర్మెంట్ సమయానికి లక్షాధికారి కావచ్చు. అదెలాగంటే..
మీ వయస్సు 25 ఏళ్లున్నప్పుడు మీ బేసిక్ శాలరీ 25 వేల రూపాయలుంటే ఇది సాధ్యమవుతుంది. ఎలాగంటే మీ వయస్సు 30 ఏళ్లున్నప్పుడు మీ శాలరీ 28 వేల 51 రూపాయలవుతుంది. ఈ లెక్కన 2.30 కోట్లు రిటైర్మెంట్ సమయానికి అవుతుంది. అదే మీ వయస్సు 35 ఏళ్లన్నప్పుడు మీ శాలరీ 39 వేల 343 రూపాయలైతే..రిటైర్మెంట్ సమయానికి మీకు 1.85 కోట్లు చేతికి అందుతాయి. మీ వయస్సు 40 ఏళ్లున్నప్పుడు మీ శాలరీ 55 వేల 181 రూపాయలైతే..రిటైర్మెంట్ సమయానికి మీకు 1. 42 కోట్లు లభిస్తాయి. ఇక మీ వయస్సు 45 ఏళ్లు అయుంటే..మీ శాలరీ 77 వేల 394 రూపాయలైతే రిటైర్మెంట్ సమయానికి మీ చేతికికి 1.03 కోట్లు లభిస్తాయి. ఇక మీ వయస్సు 50 ఏళ్లున్నప్పుడు మీ శాలరీ 1 లక్షా 8 వేల 549 రూపాయలైతే మీ రిటైర్మెంట్ సమయానికి 66 లక్షలు చేతికి అందుతాయి.
అయితే అదే సమయంలో గుర్తుంచుకోవల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. అత్యవసరమైతే తప్ప ఈపీఎప్ డబ్బుల్ని విత్‌డ్రా చేయవద్దు. విత్‌డ్రా చేస్తుంటే రిటైర్మెంట్‌లో వచ్చే బెనిఫిట్స్ తగ్గిపోతుంటాయి. ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సులో 1 లక్ష రూపాయలు విత్‌డ్రా చేస్తే..60 ఏళ్లు వచ్చినప్పుడు 11.55 లక్షలు రిటైర్మెంట్ ఫండ్ నుంచి తగ్గిపోతాయి. మరోవైపు ఉద్యోగం మారితే..మీ పాత పీఎఫ్ ఎక్కౌంట్‌ను దానికి బదిలీ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే పీఎఫ్ ఎక్కౌంట్ ఎంత పాతదైతే అంత ఎక్కువగా ప్రయోజనాలుంటాయి.
Also read: FCRA Act: ఢిల్లీ ఐఐటీ సహా ఆ సంస్థలకు ఇక విదేశీ విరాళాలు లేవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి