Physical Relation On Marriage Promise: ప్రస్తుతం ప్రేమ పేరుతో పెళ్లికి ముందే శారీరకంగా కలవడం, ఆపై వివాదాలు చెలరేగడం, చివరికి పోలీస్ స్టేషన్‌కు వ్యవహారం వెళ్లడం చూస్తున్నాం. ఇలాంటి ఓ కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లి చేసుకుంటాననే హామీ ఇచ్చారంటూ కొంతకాలం శారీరకంగా కలవడాన్ని అత్యాచారంగా పరిగణించలేమని ఢిల్లీ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Worlds Highest Paid Celebrities: బావను వెనక్కినెట్టి మరీ టాప్ లేపిన ముద్దుగుమ్మ!



పెళ్లికి ముందు యువతి, యువకుడు, లేక ఆడా, మగవారు చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్న సమయంలో జరిగే శారీరక కలయిక ప్రతి సందర్భంలోనూ రేప్ కిందకి పరిగణనలోకి రాదని ఢిల్లీ (Delhi) హైకోర్టు తీర్పిచ్చింది. ఎక్కువ కాలం ప్రేమలో ఉన్నప్పుడు ఏర్పడే శారీరక సంబంధాలు అత్యాచారం జరిగిందని సమర్థించలేమని జస్టిస్ విభు భక్రు పేర్కొన్నారు. 


Also Read: EPFO: పీఎఫ్ ఖాతాలో వడ్డీ ఎప్పుడు జమకానుందో తెలుసా?



పెళ్లి చేసుకుంటానని తనని నమ్మించిన వ్యక్తి అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లి పేరుతో సుదీర్ఘకాలం శారీరక సంబంధాలు కొనసాగించడాన్ని అత్యాచారం జరిగినట్లు పరిగణించలేమని చెప్పడంతో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించారు. 


Also Read: Coronavirus: తెలంగాణలో కొత్తగా 551 కరోనా కేసులు, రికవరీలో భేష్!



కాగా, కొన్నేళ్ల కిందట (2008లో) ఓ వ్యక్తితో యువతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం వాళ్లిద్దరూ కలిసి ఉన్నారు. ఆపై పెళ్లి పేరుతో నమ్మించి తనపై అత్యాచారం చేశాడని కోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘకాలం కొనసాగిన సంబంధాలను అత్యాచారం కిందకి రాదని, రేప్ జరిగిందని భావించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది.


Gallery: Payal Rajput Photos: నటి పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ ఫొటోస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook