న్యూ ఢిల్లీ: కొవిడ్-19 ( COVID-19 ) వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కి ( PM CARES Fund ) తొలి ఐదు రోజుల్లోనే రూ. 3,076 కోట్లు సమకూరినట్టు ఎకౌంట్ స్టేట్‌మెంట్ స్పష్టంచేసింది. పీఎం కేర్స్ ఫండ్‌కి 2019-20 ఆర్థిక సంవత్సరంలో ( 2020లో మార్చి 27 నుంచి 31 వరకు మాత్రమే ) విరాళాల రూపంలో అందిన మొత్తాన్ని పీఎం కేర్స్ ఫండ్ అధికారిక వెబ్‌సైట్‌పై కేంద్రం వెల్లడించడంతో ఈ వివరాలు వెలుగులోకొచ్చాయి. పీఎం కేర్స్ ఫండ్ ఖాతా ఏర్పాటు చేసిన తొలి ఐదు రోజులకో గత ఆర్థిక సంవత్సరం ముగిసిన సంగతి తెలిసిందే. అలా తొలి ఐదు రోజులకు విరాళాలతో పాటు ఆ మొత్తంపై వచ్చిన వడ్డీ, పన్నుతొలగింపు అనంతరం ఉన్న మొత్తం రూ.3,076.62 కోట్లుగా తేలినట్టు పీఎం కేర్స్ ఫండ్ ఖాతాకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. Also read : Hyderabad metro rail: సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సేవలు.. తెలుసుకోవాల్సిన విషయాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, పీఎం కేర్స్ ఫండ్‌కి విరాళాల రూపంలో వచ్చిన నిధిని బహిర్గతం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి డిమాండ్ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఎం కేర్స్ ఫండ్‌కి తొలి ఐదు రోజులకు సమకూరిన నిధిపై కాంగ్రెస్ నేత పి చిదంబరం ( P Chidambaram ) స్పందిస్తూ.. పీఎం కేర్స్ ఫండ్ నిధికి తొలి ఐదు రోజుల్లోనే రూ. 3,076 కోట్లు సమకూరినట్టు వెల్లడించిన ఆడిటర్స్.. ఆ నిధిని విరాళంగా అందించిన దాతల పేర్లు ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. Also read : Adipurush villain: విలన్ పాత్రపై ప్రభాస్ ఇచ్చిన అప్‌డేట్ 


ఏదైనా ట్రస్టుకి లేదా ఎన్జీవోకి పరిమితికి మించి నిధులు విరాళంగా అందించే దాతల వివరాలను వెల్లడించాలనే నిబంధన పీఎం కేర్స్ ఫండ్‌కి ఎందుకు వర్తించదు అని చిదంబరం ట్వీట్ చేశారు. దాతల వివరాలు వెల్లడించేందుకు ఎందుకు జంకుతున్నట్టు అని చిదంబరం తన ట్వీట్ ద్వారా కేంద్రాన్ని నిలదీశారు. Also read : India vs China: సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత.. హోంశాఖ అలర్ట్ ఆదేశాలు