ప్రధాని మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి మహూర్తం ఖరారు
ప్రధాని మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి మహూర్తం ఖరారు
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి తేదీ, ముహూర్త ఖరారైంది. ఈ నెల 30న సాయంత్రం 7 గంటలకు వివిధ దేశాధినేతలు, వీవీఐపీల మధ్య మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు పలువురు బీజేపి నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. హోంశాఖ, ఆర్థిక శాఖ, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖ వంటి కీలకమైన శాఖలను తొలిదశలో భర్తీ చేయనున్నారని సమాచారం. అయితే, ఎవరెవరికి ఏయే మంత్రి పదవులు దక్కుతాయనే విషయంలోనే ఇంకా ఓ స్పష్టత రాలేదు.
ఇదిలావుంటే, ప్రధానిగా నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రమాణస్వీకారం చేయనున్న రోజే విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయనుండటంతో జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ హాజరయ్యే అవకాశాలు లేవని పరిశీలకులు భావిస్తున్నారు.