PM Kisan Yojana: త్వరలో పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు.. ఈకేవైసీ అప్డేట్కు ఇంకా 7 రోజులే గడువు...
PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన పథకం కింద త్వరలో 11వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. కేంద్రం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరి. ఈకేవైసీ అప్డేట్కు ఇంకా 7 రోజులే మిగిలి ఉంది.
PM Kisan Yojana: దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ప్రతీ ఏటా కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సాయం రైతులకు అందుతోంది. ఈ ఏడాది జనవరిలో పీఎం కిసాన్ 10వ విడత నిధులు విడుదల చేసిన కేంద్రం త్వరలోనే 11వ విడత నిధులు విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం పొందాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి. ఈ-కేవైసీ అప్‌డేట్ చేసేందుకు మే 31 చివరి తేదీ. వాస్తవానికి మార్చి 22నే గడువు ముగిసినప్పటికీ రైతుల కోసం కేంద్రం మరో 9 రోజుల పాటు గడువు పొడగించింది. ప్రస్తుతం ఏడు రోజుల గడువు మాత్రమే ఉంది. ఒకవేళ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే పీఎం కిసాన్ నిధులు పొందలేరు. కాబట్టి ఈ పథకం లబ్దిదారులు గడువు లోగా ఈకేవైసీ అప్‌డేట్ చేయాలి. ఈకేవైసీ అప్‌డేట్ ప్రొసీజర్ ఇప్పుడు పరిశీలిద్దాం...
పీఎం కిసాన్ ఈకేవైసీ ఇలా అప్‌డేట్ చేయండి :
Step 1: పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.nic.in ఓపెన్ చేయండి.
Step 2: హోమ్ పేజీలో 'ఫార్మర్ కార్నర్' ఆప్షన్‌పై క్లిక్ చేసి... ఈకేవైసీ ఆప్షన్ ఎంచుకోండి.
Step 3: ఓటీపీ ఆధారిత ఈకేవైసీ సెక్షన్‌లో మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
Step 4: 'సెర్చ్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
Step 5: మీ ఆధార్ కార్డుతో లింకప్ అయి ఉన్న మొబైల్ నంబర్ ఎంటర్ చేసి 'గెట్ ఓటీపీ'పై క్లిక్ చేయండి.
Step 6: ఓటీపీ ఎంటర్ చేయండి.
Step 7: మీరు నమోదు చేసిన వివరాలు సక్సెస్‌ఫుల్‌గా వెరిఫై అయితే ఈకేవైసీ పూర్తయినట్లే.
పీఎం కిసాన్‌లో మీ పేరు నమోదుకు ఇలా అప్లై చేయండి :
Step 1: పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.in ఓపెన్ చేయండి.
Step 2: హోమ్ పేజీలో కుడి వైపు 'ఫార్మర్ కార్నర్' అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
Step 3: 'న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
Step 4: ఇప్పుడు స్క్రీన్‌పై రిజిస్ట్రేషన్ ఫామ్ కనిపిస్తుంది.
Step 5: రిజిస్ట్రేషన్ ఫామ్‌లో పూర్తి వివరాలు ఎంటర్ చేయాలి.
Step 6: సబ్‌మిట్ బటన్‌పై ప్రెస్ చేసి రిజిస్ట్రేషన్ ఫామ్‌ను సబ్‌మిట్ చేయండి.
Also Read:TSRTC Free Service: టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద 'ఫ్రీ' సర్వీస్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి