PM Kisan Money: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలతో దేశంలోని మెజార్టీ ప్రజలు లబ్ది పొందుతున్నారు. ప్రతి ఏటా కోట్లాది ప్రజలు సంక్షేమ పధకాలతో ప్రయోజనం అందుకుంటున్నారు. కొన్ని పథకాలతో సబ్సిడీ లభిస్తుంటే మరి కొన్ని పథకాలతో నేరుగా నగదు అందుతోంది. అందులో ఒకటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశంలోని అన్నదాతలకు ప్రతి ఏటా 6 వేల రూపాయలు అందుతున్నాయి. ప్రతి నాలుగు నెలలకోసారి 2 వేల చొప్పున ఏడాదిలో 6 వేలు కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పుడు రైతులకు 19వ వాయిదా అందాల్సి ఉంది. మరి కొద్దిరోజుల్లో ఈ డబ్బులు అందనున్నాయి. ఇప్పటి వరకూ రైతులకు 18 వాయిదాలు అందాయి. చివరి సారిగా 18వ వాయిదా అక్టోబరా్ నెలలో అందింది. అంటే 19వ వాయిదా మరో పదిహేను రోజుల్లో జనవరి నెలలో తీసుకోవల్సి ఉంది. 


పీఎం కిసాన్ 19వ వాయిదా కోసం ఏం చేయాలి


పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్దిదారులైతే ముందుగా భూమి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఆ తరువాత రెండవది ఇ కేవైసీ పూర్తి చేయడం. దీనికోసం సమీపంలోని  కార్యాలయానికి వెళ్లి ఇ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో కూడా చేయవచ్చు. నాలుగవది ఆధార్ కార్డు అనుసంధానం. బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. 


ఈ అన్నింటిలో ఏది జరగకపోయినా 19వ వాయిదా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఆగిపోవచ్చు. అందుకే మరో 15 రోజుల్లో అంటే జనవరి నెలలో పీఎం కిసాన్ డబ్బులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుకోవాలంటే ఈ పనులు అప్‌డేట్ చేసుకోవాలి. 


Also read: Salary DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కళ్లు చెదిరే గుడ్‌న్యూస్, భారీగా పెరగనున్న జీతం, డీఏ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.