PM Kisan Scheme: పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు అలర్ట్.. ఈ తేదీని గుర్తుపెట్టుకోండి
PM Kisan 13th Installment: పీఎం కిసాన్ లబ్ధిదారులు ప్రస్తుతం 13వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈలోపే రైతులకు అధికారులు ఓ అలర్ట్ జారీ చేశారు. వివరాలు ఇలా..
PM Kisan 13th Installment: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు ముఖ్య గమనిక. దేశవ్యాప్తంగా రైతులు ఫిబ్రవరి 10వ తేదీన గుర్తుపెట్టుకోండి. దేశంలోని కోట్లాది మంది రైతులు 13వ విడత నిధుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హోలీ కంటే ముందే రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు ప్రభుత్వం జమ చేసే అవకాశం ఉంది. అయితే అంతకుముందే పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు ఫిబ్రవరి 10వ తేదీలోపు వారి బ్యాంక్ ఖాతా ఈకేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ కావాలంటే ఈకేవైసీ ధృవీకరణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. అదేవిధంగా బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలని సూచించారు.
ఇప్పటికీ 1.94 లక్షల మంది రైతులు లింక్ చేయలేదని అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులు జనవరి నాటికి 67 శాతం ఈకేవైసీ, 88 శాతం బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించారని వెల్లడించారు. ఇంకా 24.45 లక్షల మంది లబ్ధిదారులు ఈకేవైసీ చేయాల్సి ఉందన్నారు. 1.94 లక్షల మంది లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోలేదని చెప్పారు. ఫిబ్రవరి 10వ తేదీలోపు పూర్తి చేయాలని కోరారు.
దేశంలో రైతులు ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ని 2019లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సన్నకారు రైతులకు పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి మూడు వాయిదాల్లో రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం జమచేస్తోంది. అయితే ఈ నగదను రూ.8 వేలకు పెంచుతుందని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి కేంద్రం వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని చెప్పారు.
పీఎం కిసాన్ పథకం ప్రారంభించిన తరువాత ఇప్పటివరకు మొత్తం 12 విడతల్లో రైతులకు ఆర్థిక సహాయం అందజేసింది. 13వ విడత పెట్టుబడి సాయం హోలీ పండగకు ముందే లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈకేవైసీ, బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్‌ను చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి