PM Modi: ఆ ఘటన పట్ల శిరస్సు వంచి క్షమాపణలు చెబుతున్న.. ఎమోషనల్ అయిన మోదీ..
Narendra Modi: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాం కూలిపోవడం మహారాష్ట్రలో పెనుదుమారంగా మారింది. ముఖ్యంగా మరాఠాలు చత్రపతిని శివాజీని తమ ఆరాధ్య దైవంగా కొలుచుకుంటారు. ఈనేపథ్యంలో అపోసిషన్ నేతలు సైతం.. ఈ ఘటనను తీవ్రంగా ఎండగడుతున్నారు.
pm modi on shivaji maharaj statue collapse: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో మోదీ ప్రతిష్టించిన విగ్రహం ఇటీవల కూలిపోయింది. ఇది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పవచ్చు. దీనిపై.. అపోసిషన్ పార్టీలన్ని ఏకమైన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో తీవ్ర అవినీతి చోటు చేసుకుందని.. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన నేతృత్వంలోని మహా వికాస్ ఆఘాఢీ ఎద్దేవా చేశారు.
ఈ నేపథ్యంలో.. తాజాగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై స్పందించారు.దేశ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ విగ్రహాం కూలిపోవడం తనను ఎంతగానో కలిచి వేసిందని మోదీ అన్నారు. ఈ ఘటనపట్ల.. తాను.. తల వంచి శివాజీ మహారాజ్ కు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. భరతమాత ముద్దుబిడ్డకు ఇలాంటి ఘటన జరగటం బాధకరమన్నారు. అంతేకాకుండా.. శివాజీ అంతే తనకు ఎనలేని గౌరవముందని,
2013 లో ప్రధానమంత్రి అభ్యర్థిగా తనను బీజేపీ ప్రకటించినపుడు.. మొట్టమొదటగా రాయ్‌గఢ్ జిల్లాలో ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ సమాధి వద్దకు చేరుకున్న విషయంను మోదీ గుర్తు చేశారు. ప్రస్తుతం శివాజీ మహారాజ్ విగ్రహాం కూలిపోవడం పట్ల కొంత మంది రాజకీయాలు చేస్తున్నారని కూడా మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. ఆగస్టు 26 వ తేదీన సింధ్‌దుర్గ్ జిల్లాలోని మాల్వాన్ ప్రాంతంలోని రాజ్‌కోట్ కోటలో ఉన్న 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఆ విగ్రహాన్ని 2023 డిసెంబర్ 4వ తేదీన నేవీ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహావిష్కరించారు. అయితే విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా ప్రారంభించి ఏడాది పూర్తి కాకుండానే కూలిపోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో మాత్రం వివాదస్పదంగా మారింది.
శివాజీ విగ్రహం కూలిన ఘటనపై.. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా చేసుకుని, అపోసిషన్ పార్టీలన్ని ఏకమై.. విమర్శలు గుప్పించింది. దీనిపై మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో దీనిపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే సైతం..తాను ఈ ఘటన పట్ల తీవ్ర మనస్తాపానికి గురౌతున్నట్లు తెలిపారు.
Read more: Viral video: కిడ్నాపర్ ప్రేమకు ఫిదా అయిన బుడ్డొడు.. ఇంటికి వెళ్లనంటూ రచ్చ.. వీడియో వైరల్..
శివాజీ మహారాజ్ కు , ప్రజలకు వందల సార్లు క్షమాపణలు చెప్పేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు. కానీ దీన్ని మాత్రం రాజకీయం చేయోద్దంటూ అపోసిషన్ నేతల్ని కోరారు. ప్రస్తుతం మోదీ మాత్రం ఈ ఘటన పట్ల క్షమాపణలు చెప్పడం వార్తలలో నిలిచింది. గతంలో మోదీ.. మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న క్రమంలో రైతులకు.. క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.