ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక నగరం అయోధ్య (PM Modi Arrives in Ayodhya)కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేదరిన ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం అయోధ్యలో అడుగుపెట్టారు. అయోధ్యలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. నేడు అయోధ్యలో రామ మందిరానికి ఆయన భూమి పూజ  (Ram Temple Bhoomi Puja) నిర్వహించి, స్వయంగా ఇటుక పేర్చి శంకుస్థాపన చేయనున్నారు. అయోధ్యలో నేడు ప్రధాని మోదీ షెడ్యూల్ ఇలా..



యూపీలోని అయోధ్యకు చేరుకున్న ప్రధాని నేరుగా హనుమాన్ గఢీ ఆలయానికి బయలుదేరారు. చారిత్రక విశిష్టత కలిగిన ప్రముఖ హనుమాన్ ఆలయానికి ప్రధాని మోదీ చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ పూజలలో పాల్గొన్నారు. ఇక్కడ స్వామివారి దర్శనం తర్వాత అయోధ్యలో నిర్మాణం చేపట్టనున్న ప్రాంతంలోని రామ్ లల్లాను వీరు దర్శించుకోనున్నారు. అనంతరం రామ మందిరం కార్యక్రమాలలో పాల్గొంటారు.  Ram Temple: టైమ్ క్యాప్సుల్‌ నిజమేనా? ట్రస్ట్ ఏం చెబుతోంది?