Ram Temple: టైమ్ క్యాప్సుల్‌ నిజమేనా? ట్రస్ట్ ఏం చెబుతోంది?

రామ మందిరం నిర్మాణం దిశగా అడుగులు పడుతున్న కొద్దీ దీనికి సంబంధించి ఏదో ఒక విషయం చర్చకు వస్తోంది. ఈ క్రమంలో వైరల్ అవుతున్న తాజా అంశం రామ మందిరం కింద టైమ్ క్యాపుల్స్‌ (Time Capsule Ram Mandir) ను ఏర్పాటు చేయడం.

Last Updated : Jul 28, 2020, 02:29 PM IST
Ram Temple: టైమ్ క్యాప్సుల్‌ నిజమేనా? ట్రస్ట్ ఏం చెబుతోంది?

అయోధ్యలో రామ మందిరం (Ram Temple In Ayodhya) నిర్మాణం దిశగా అడుగులు పడుతున్న కొద్దీ దీనికి సంబంధించి ఏదో ఒక విషయం చర్చకు వస్తోంది. ఈ క్రమంలో వైరల్ అవుతున్న తాజా అంశం రామ మందిరం కింద టైమ్ క్యాప్సుల్‌ (Time capsule under Ram Temple) ను ఏర్పాటు చేయడం. దాదాపు 2వేల అడుగుల లోతులో రామ మందిర నిర్మాణం, దీని విశిష్టత, చరిత్ర తెలిసేలా కొన్ని వస్తువులతో కూడిన పెట్టేను నిక్షిప్తం చేశారని ప్రచారం జరిగింది. అయితే టైమ్ క్యాప్సుల్ అనేది నిజం కాదని తాజాగా తెలిసింది. Ayodhya: రామ జన్మభూమి శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్

టైమ్ క్యాప్సుల్‌పై రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్ట్ (Ram Janmabhoomi Teerth Kshetra Trust) కార్యదర్శి ఛంపత్ రాయ్ ఏఎన్ఐ మీడియాతో మాట్లాడారు. ‘ఆగస్టు 5న నిర్మింప తలపెట్టిన రామ మందిరం (Ayodhya Ram Temple) కింద ఎలాంటి టైమ్ క్యాప్సుల్ పెట్టడం లేదు. బయట జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. రామ మందిరం కింద టైమ్ క్యాప్సుల్ (Time Capsule At Ram Temple) నిక్షిప్తం చేస్తారన్న వదంతులను నమ్మవద్దని’ ఛంపత్ రాయ్ స్పష్టం చేశారు. Also read: అయోధ్య రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

కాగా, గతంలో వివాదాలు భవిష్యత్‌లోనూ మళ్లీ తలెత్తకూడదన్న ఉద్దేశంతో రామాలయం నిర్మిస్తున్న స్థలంలో టైమ్ క్యాప్సుల్  (Time capsule under Ram Mandir)పెడుతున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు కామేశ్వర్ చౌపల్ ఇటీవల మీడియాకు తెలపడం గమనార్హం. ఇక అది మొదలుకుని టైమ్ క్యాప్సుల్‌పై చర్చలు, ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రస్ట్ కార్యదర్శి టైమ్ క్యాప్సుల్ నిజం కాదని వివరణ ఇచ్చారు. Sourav Ganguly: త్వరలో తేలనున్న గంగూలీ భవితవ్యం.. 

Trending News