Ram Temple Bhoomi Puja: అయోధ్యలో నేడు ప్రధాని మోదీ షెడ్యూల్ ఇలా..

నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామాలయం శంకుస్థాపన జరగనుంది. ప్రధాని దాదాపు 3 గంటలపాటు అయోధ్య నగరం (PM Modi Schedule in Ayodhya)లో పలు కార్యక్రమాలో పాల్గొననున్నారు. 

Last Updated : Aug 5, 2020, 08:14 AM IST
Ram Temple Bhoomi Puja: అయోధ్యలో నేడు ప్రధాని మోదీ షెడ్యూల్ ఇలా..

హిందువుల శతాబ్దాల స్వప్నం సాకారం దిశగా తొలి అడుగు నేడు పడనుంది. రాముడి జన్మస్థలమైన అయోధ్య (Ayodhya Ram Temple)లో వివాదం ముగిసి, రామాలయం నిర్మాణానికి భూమి పూజ (Ram Temple Bhoomi Puja), శంకుస్థాపన చేయననున్న చారిత్రక ఘట్టం రానే వచ్చింది. బాబ్రీ మసీదు కోసం సుదీర్ఘకాలం పోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి తొలి ఆహ్వానం అందించి మత సామరస్యాన్ని చాటుకున్నారు. రాముడి తల్లి కౌసల్య జన్మస్థలం నుంచి మరో ముస్లిం యువకుడు మట్టిని అయోధ్యకు తీసుకురావడం గమనార్హం. Ram Temple: టైమ్ క్యాప్సుల్‌ నిజమేనా? ట్రస్ట్ ఏం చెబుతోంది? 

అయోధ్యలో ప్రధాని మోదీ.. (PM Modi Schedule in Ayodhya)
నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామాలయం శంకుస్థాపన జరగనుంది. ప్రధాని దాదాపు 3 గంటలపాటు అయోధ్య నగరంలో పలు కార్యక్రమాలో పాల్గొననున్నారు.  బుధవారం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు వేద, మంత్రోచ్ఛరణల మధ్య అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ దాదాపు 40 కేజీల వెండి ఇటుకతో రామాలయానికి శంకుస్థాపన చేస్తారు. అయితే అంతకుముందు స్థానికంగా ఉన్న ప్రఖ్యాత హనుమాన్ గఢీలో ఆంజనేయస్వామిని దర్శించుకుని పూజలు చేయనున్నారు. Ayodhya: రాముని ప్రత్యేక వస్త్రాలు సిద్ధం

హనుమాన్ గఢీ నుంచి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగే ప్రాంతానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడ రామ్ లల్లా విరాజ్‌మాన్‌ను దర్శించుకుంటారు. పారిజాత మొక్కరు నాటి అనంతరం రామ మందిరానికి శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. ఆపై రామ మందిరానికి సంబంధించి పోస్టల్ స్టాంప్ విడుదల చేయనున్నారని అధికారులు తెలిపారు. అయోధ్య నగరంలో ఎటు చూసిన రాముడి భజనలు, రాముడి ఫొటోలు, శంకుస్థాపనకు సంబంధించిన ఫ్లెక్సీలు దర్శనమివ్వనున్నాయి. చారిత్రక ఘట్టానికి ముందురోజు Hanuman Chalisa పఠించిన కమల్‌నాథ్

Trending News