ఇండియన్ ఆర్మీ ( Indian Army Soldiers ) సైనికులతో దీపావళి పండుగను జరుపుకునే అలవాటును ప్రధాని మోదీ కొనసాగించారు. లాంగేవాలా పోస్ట్ లో సైనికులతో దీపావళి ( Diwali Festival )జరుపుకున్నారు. సైనికులకు స్వీట్స్ పంచిపెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశం కోసం అహర్నిశలూ శ్రమిస్తూ..ఒక్కొక్కసారి ప్రాణాలర్పిస్తున్న ఇండియన్ ఆర్మీ సైనికులతో దీపావళి పండుగ జరుపుకోవడం ప్రధాని నరేంద్ర మోదీ ఒక అలవాటుగా మార్చుకున్నారు. ఇందులో భాగంగా ఇవాళ రాజస్థాన్ జై సల్మేర్ ( Rajasthan Jaisalmer ) లోని లోంగావాలా పోస్ట్ ( Longewala post ) సైనికులతో దీపావళి జరుపుకున్నారు. యుద్ధట్యాంకుల ప్రదర్శనను చూడటమే కాకుండా..స్వయంగా ఓ యుద్ధ ట్యాంకుపై కాస్సేపు సైనికులతో కలిసి తిరిగారు.



ఆర్మీ సైనికులకు స్వయంగా స్వీట్ ప్యాకెట్లు పంచిపెట్టారు.



ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సైనికుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. శత్రువులు రెచ్చగొడితే దీటైన సమాధానమిస్తామని ప్రధాని మోదీ ( Pm modi ) స్పష్టం చేశారు. మన సరిహద్దుల్ని రక్షించుకోవడంలో ప్రపంచంలోని ఏ శక్తి కూడా మన సైనికుల్ని నిలువరించలేదని తెలిపారు మోదీ. సవాళ్లను ఎదుర్కొని దీటైన సమాధానం చెప్పడంలో ఇండియా తన శక్తి సామర్ధ్యాల్ని రుజువు చేసుకుందని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం ఇండియా ఎప్పుడూ రాజీ పడదనే విషయం ప్రపంచానికి తెలుసన్నారు.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR


Also read: DRDO Missile: రెప్పపాటు కాలంలో లక్ష్యాన్ని ఛేదించి అరుదైన ఘనత