భారతదేశ ప్రతిష్టాత్మక సంస్థ డీఆర్డీవో మరో అరుదైన ఘనత సాధించింది. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ను అత్యంత విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిస్సైల్ ప్రత్యేకతలివీ..
మిస్సైల్స్ తయారీలో భారతదేశంలో ప్రతిష్టాత్మక సంస్థ డీఆర్డీవో. ఈ సంస్థ ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ( QRSAM) ను విజయవంతంగా ప్రయోగించి..ఓ వాహనాన్ని ధ్వంసం చేసింది. ఒరిస్సాలోని బాలాషోర్ ( Balasore, Odisha ) తీరప్రాంతం నుంచి ఈ ప్రయోాగం నిర్వహించారు. డీఆర్డీవో ( DRDO ) అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్ ను నిన్న మధ్యాహ్నం 3.50 గంటల ప్రాంతంలో చంఢీపుర్ ఐటీఆర్‌నుంచి గాల్లోకి ప్రయోగించగా కేవలం ఎనిమిది సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 25-30 కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలను ఇది అత్యంత సులభంగా ఛేదించగలదు. ఈ ప్రయోగానికి సంబంధించిన లైవ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH: Successful testfiring of the DRDO-developed Quick Reaction Surface to Air Missile system off the coast of Balasore, Odisha yesterday. The Missile can hit targets in air at a strike range of 25-30 km. During the testfiring, it hit its target directly. pic.twitter.com/szA2J2cytG
— ANI (@ANI) November 14, 2020
భారత నౌకాదళం ( Indian Naval Force ) గత నెలలోనే తూర్పు నౌకాదళ ( Eastern naval command ) పరిధిలో బంగాళాఖాతం ( Bay of Bengal ) లో క్షిపణి సామర్ధ్య యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కోరా నుంచి నౌక విధ్వంసక క్షిపణిని విజయవంతంగా ప్రయోగించి రికార్డు సాధించింది. ఇప్పుడు డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ క్షిపణి కేవలం 8 సెకన్ల వ్యవధిలో లక్ష్యాన్ని ఛేదించడం నిజంగానే ఓ అద్భుతం. Also read: Covid19 Vaccine: ఇండియాలో డిసెంబర్ నాటికి పదికోట్ల వ్యాక్సిన్‌లు
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR