దేశ ఆర్ధిక స్థితిపై విద్యార్థులతో మాట్లాడే దమ్ము ప్రధానికి ఉందా: రాహుల్ గాంధీ
దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు క్షీణిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతూ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులతో ఆర్ధిక మందగమనంపై మాట్లాడే ధైర్యం ప్రధాని నరేంద్ర మోదీకి ఉందా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రధానికి ఆ ధైర్యం లేదు అని రాహుల్ గాంధీ నొక్కి చెప్పారు
న్యూ ఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు క్షీణిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతూ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులతో ఆర్ధిక మందగమనంపై మాట్లాడే ధైర్యం ప్రధాని నరేంద్ర మోదీకి ఉందా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రధానికి ఆ ధైర్యం లేదు అని రాహుల్ గాంధీ నొక్కి చెప్పారు
20 పార్టీలకు సంబంధించిన విపక్ష నాయకులు ప్రత్యేకంగా హాజరైన సమావేశం అనంతరం రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ దేశాన్ని విభజించి సామాన్య ప్రజలను అసహనానికి గురిచేస్తున్నారని ఆయన అన్నారు. ఇచ్చిన వావాగ్దానాలు నెరవేర్చకుండా, ప్రజల దృష్టిని మరల్చి పబ్బం గడుపుతున్నారని ఆయన అన్నారు.
ప్రధాని మోదీ దేశంలోని విశ్వవిద్యాలయాలకు వెళ్లాలని, విద్యార్థులతో ముచ్చటించాలని, వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆయన అన్నారు. ఎటువంటి రక్షణ లేకుండా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులతో సమావేశమవ్వాలని, తాను ఏమి చేయబోతున్నానో విద్యార్థులకు చెప్పాలని, వారిని ఒప్పించాలని రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి సవాలు విసిరారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..