ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలో పర్యటించిన ప్రధాని మోడీ ...తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విమర్శల దాడికి దిగారు. ఈ సందర్భంగా మీర‌ట్‌లో జ‌రిగిన బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా యూపీలో అమలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర పథకాల గురించి జనాలకు వివరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సంద్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై సెటైర్లు సంధించారు. యూపీలోని బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడింది మహాకూటమి కాదని..అది మాయా కుటమి అని ఎద్దేవ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ, ఆర్ఎల్డీ, బీఎస్సీ కూట‌మిని ఆయ‌న త‌ప్పుబట్టారు. యూపీ మ‌హాకూట‌మి.. ష‌రాబ్‌(మ‌ద్యం)తో స‌మానం మోడీ ఎద్దేవ చేశారు


స‌మాజ్‌వాదీ పార్టీలోని సా, ఆర్ఎల్డీ పార్టీలోని రా, బీఎస్పీ పార్టీలో బా క‌లిపితే ష‌రాబ్‌(మ‌ద్యం) అవుతుంద‌ని మోదీ సెటైర్లు వేశారు. షరాబ్ గా ఏర్పడిన ఈ కూటమిని నమ్ముకుంటే భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోతుందని విమర్శించారు