PM Modi US Tour: అగ్రరాజ్యం అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. జిల్ బైడెన్‌కు `డైమండ్` గిఫ్ట్ ఇచ్చిన భారత ప్రధాని!
PM Modi US Tour: యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని మోదీ స్వీకరించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. బైడెన్ దంపతులకు విలువైన కానుకలు ఇచ్చారు.
PM Modi US Tour: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో భాగంగా.. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ అయ్యారు. ప్రధాని మోదీకి బైడెన్ దంపతులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ఇచ్చిన అతిథ్యాన్ని మోదీ స్వీకరించారు. ప్రధాని వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా కూడా వైట్ హౌస్ లోకి వెళ్లారు. ప్రధానికి పురాతన అమెరికన్ బుక్ గ్యాలీతోపాటు ఓల్డ్ అమెరికన్ కెమెరాను బైడెన్ బహుకరించారు.
మరోవైపు ప్రధాని మోదీ... యూఎస్ ప్రెసిడెంట్ కు గంధపు చెక్కతో తయారు చేసిన పెట్టెను కానుకగా ఇచ్చారు. ప్రాచీన భారతీయ గ్రంథమైన కృష్ణ యజుర్వేదంలో పేర్కొన్న ‘'దృష్ట సహస్రచంద్రో'’ అని రాసిన పత్రాన్ని అందులో ఉంచారు. అంటే.. వెయ్యి నిండు చంద్రులను చూసిన వ్యక్తి అని అర్థం. రాజస్థానీ కళాకారులు చేసిన ఈ పెట్టెలో గణేశుడి విగ్రహం, వెండితో రూపొందించిన దీపపు ప్రమిద ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు ల్యాబ్ లో తయారు చేసిన 7.5 క్యారెట్ల గ్రీన్ డైమండ్‌ను మోదీ బహుమతిగా ఇచ్చారు. దీనిని స్పెషల్ గా డిజైన్ చేసిన పేపర్ బ్యాక్స్ లో పెట్టి మరి ఇచ్చారు.
Also Read: Petrol, Diesel Prices: వాహనదారులకు గుడ్ న్యూస్..పెట్రోల్, డీజిల్ ధరలపై భారీ తగ్గింపు
బుధవారం మధాహ్నాం అమెరికాకు వెళ్లిన ప్రధాని మోదీ న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. అక్కడే ఐరాస శాంతి దూతల మెమోరియల్ అయిన వాల్ ఆఫ్ పీస్ వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి వాషింగ్టన్ కు బయలుదేరి వెళ్లారు. అనంతరం ప్రధాని మోదీ అక్కడి పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ప్రముఖ చిప్‌ల తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజయ్ మెహ్రోత్రా, జనరల్ ఎలక్ట్రిక్ సీఈవో లారెన్స్ కల్ప్, అప్లైడ్ మెటీరియల్స్ సీఈవో గారీ ఈ డికర్సన్‌తో భేటీ అయిన మోదీ.. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు.
Also Read: Threat to PM Modi, Amit Shah: మోదీ, అమిత్ షా, నితీశ్‌లను చంపేస్తానని బెదిరింపు కాల్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి