Petrol, Diesel Prices Going to Drop: వాహనదారులకు గుడ్ న్యూస్.. రూ.4 నుండి 5 తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol, Diesel Prices Cut by 4 - 5 Rupes: 2023 - 24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీ లాభాలు చవిచూశాయని.. ఈ కారణంగానే ఆగస్టులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 25, 2023, 05:53 PM IST
Petrol, Diesel Prices Going to Drop: వాహనదారులకు గుడ్ న్యూస్.. రూ.4 నుండి 5 తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol, Diesel Prices Cut by Rs 4 to 5 : పెట్రోల్ ధరలు, డీజిల్ ధరల విషయంలో వాహనదారులకు ప్రభుత్వ రంగ చమురు సంస్థల నుంచి గుడ్ న్యూస్ రాబోతోందా అంటే అవుననే తెలుస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వచ్చే ఆగస్టు నెల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలపై రూ. 4 నుంచి 5 మేర తగ్గించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఇదే ఏడాది చివర్లో నవంబర్ లేదా డిసెంబర్ నెలలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీసుకోనున్న ఈ నిర్ణయం వాహనదారులకు భారీ ఊరటను అందివ్వనుంది. 

2023 - 24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీ లాభాలు చవిచూశాయని.. ఈ కారణంగానే ఆగస్టులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.

అయితే, ప్రస్తుతానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల బిజినెస్ లాభాల బాటలోనే ఉన్నప్పటికీ.. ఎన్నికల సమయం నాటికి ముడి చమురు ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం లేకపోలేదని.. అదే కానీ జరిగితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లాభాలపై మరోసారి దుష్ప్రభావం కనిపించే ప్రమాదం లేకపోలేదని జేఎం ఫినాన్షియల్ ఇనిస్టిట్యూషనల్ సెక్యురిటీస్ అధ్యయనం అంచనా వేస్తోంది. ఒక బ్యారెల్ ముడి చమురు ధర 85 అమెరికన్ డాలర్లను మించి పెరిగినట్టయితే.. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ఉండకపోవచ్చు అని అంచనాలు చెబుతున్నాయి. 

ఇది కూడా చదవండి: Chennai Train Fire Accident: తప్పిన మరో ఘోర రైలు ప్రమాదం

ఇదిలావుంటే, ఏడాది చివర్లో లోక్ సభ ఎన్నికలు ఉన్నందున ఇంధనం ధరలు తగ్గించాల్సిందిగా కేంద్రం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలతో పాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల బ్యాలెన్స్ షీట్స్‌ని పరిశీలించి చూస్తే.. ఆగస్టు నుంచి పెట్రోల్, డీజిల్ ధరలుపై రూ. 4 నుంచి 5 రూపాయల వరకు ధరలు తగ్గించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Threat to PM Modi, Amit Shah: మోదీ, అమిత్ షా, నితీశ్‌లను చంపేస్తానని బెదిరింపు కాల్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News