ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లను వదిలేస్తున్నా: పీఎం మోదీ
భారత ప్రధాని నరేంద్రమోదీ తన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ వదులుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌తో సహా తన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ వదులుకోవడం గురించి ఆలోచిస్తున్నట్లు తన అధికారిక ట్విట్టర్లో
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ తన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ వదులుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌తో సహా తన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ వదులుకోవడం గురించి ఆలోచిస్తున్నట్లు తన అధికారిక ట్విట్టర్లో పేర్కొన్నారు. పీఎం మోదీ ట్వీట్ కాసేపట్లోనే సోషల్ మీడియాలో తుఫాను తలపించింది.
ప్రజల మద్దతుతో సామాజిక మాధ్యమాలలో అత్యధికంగా అభిమానులను సంపాదించుకున్న భారతీయుల్లో ప్రధాని మోదీ ఒకరు. కాగా, ఈ నిర్ణయం వెనక గల వివరణను మార్చి 8 ఆదివారం నాడు దేశ ప్రజానీకానికి తెలియజేస్తానని ట్విట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు ట్విట్టర్లో చాలా మంది ప్రజలు సామాజిక మాధ్యమాన్ని విడిచిపెట్టవద్దని వేడుకున్నారు, ‘నో సర్’ అని ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ ట్వీట్‌పై స్పందిస్తూ, "సోషల్ మీడియా ఖాతాలను కాకుండా ద్వేషాన్ని వదులుకోమని" ప్రధానిని కోరారు. ప్రధాని మోదీకి ట్విట్టర్‌లో 53.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగాప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నారు.కాగా ట్విట్టర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి స్థానంలో ఉండగా, బరాక్ ఒబామా రెండో స్థానంలో ఉన్నారు.
ప్రధాని మోదీ ఫేస్బుక్ పేజిని 44,722,235 మంది లైక్ చేయగా, 44,597,135 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా 30 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..