Kashi Vishwanath Dham: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు.. తన సొంత పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. కాశీ సుందరీకరణ, కాశీ విశ్వనాథుని ఆలయం- గంగానదిని కలుపుతూ నిర్మించిన కారిడార్ తొలి దశ (Kasi Vishwanath corridor) అభివృద్ధి పనులను ప్రారంభించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ అభివృద్ధి పనులకు సంబంధించిన పలు ఆసక్తికర (Kashi Vishwanath Dham project) విషయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.


కాశీ విశ్వనాథ్​ కారిడార్ విశేషాలు..


ఈ అభివృద్ధి పనుల కోసం రూ.339 కోట్లు ఖర్చు చేసింది (construction cost of Kashi Vishwanath Dham) ప్రభుత్వం.


మొదటి దశలో భాగంగా 29 భవనాలు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ కాశీకి వచ్చే భక్తులకు వివిధ రకాల సేవలను అందించనున్నాయి. ఇందులో యాత్రి సువిధ కేంద్రాలు, టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లు, వేద కేంద్రాలు, సిటీ మ్యూజియం, ఫుడ్​ కోర్ట్ వంటివి ఉన్నాయి.


కాశీ విశ్వనాథుని ఆలయం అభివృద్ధి పనులకోసం తవ్వకాలు జరపగా.. 40 పురాతనమైన ఆలయాలు బయపడ్డాయి. వాటన్నింటిని పరిరక్షించి.. వాటినీ సుందరీకరించారు. గతంలో అవి ఎలా ఉండేవో ఆ వైభవాన్ని తెచ్చారు.


ఈ ప్రాజెక్ట్​ 5 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. ఇంతకు ముందు ఇక్కడ 3 వేల చదరపు అడుగులు మాత్రమే అందుబాటులో ఉండేది.


ఆలయ ముఖ ద్వారం సహా ఇతర నిర్మాణాలను రాళ్లు, ఇతర మెటీరియల్స్​ను ఉపయోగించి.. సంప్రదాయ హస్తకళాలతో నిర్మించారు.


ఈ ఆలయం అభివృద్ధి మొదటి దశ కోసం..  300 ప్రాపర్టీలను కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఈ కారణంగానే ఆలయ ప్రాంగణాన్ని విశాలంగా మార్చగలిగింది.


దాదాపు 1,400 మంది దుకాణాదురులు, నివాసం ఉండేవారు సామరస్య పూర్వకంగా సంది కుదుర్చుకున్నారు. వారందరికి మరో చోట పునరావాసం కల్పించింది ప్రభుత్వం.


గంగానది నుంచి కాశీ విశ్వనాథుని ఆలయానికి భక్తులు సులభంగా నడవగలిగేలా కారిడార్​లో ఏర్పాట్లు చేశారు. గతంలో ఈ మార్గంలో ఇరుకుగా ఉండటం వల్ల భక్తులు అవస్తలు పడే వారు.


Also read: Overnight millionaire: ఉదయం రూ.270తో లాటరీ కొన్నాడు- మధ్యాహ్నం కోటీశ్వరుడయ్యాడు!


Also read: Sant Missile: హెలీకాప్టర్ నుంచి మిస్సైల్ ప్రయోగం, సాంట్ విజయవంతం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook