Sant Missile: ఇదొక కొత్తరకం మిస్సైల్. ఏకంగా హెలీకాప్టర్ నుంచి మిస్సైల్ ప్రయోగం. స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ ప్రయోగం విజయవంతమైంది.
డీఆర్డీవో మరో విజయం సాధించింది. భారత వాయుదళంతో కలిసి మిస్సైల్ పరీక్షను విజయవంతం చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ అంటే సాంట్ మిస్సైల్ పరీక్షను(Sant Missile) విజయవంతంగా పరీక్షించింది.హెలీకాప్టర్ నుంచి మిస్సైల్ లాంచ్ చేయడం ఈ మిస్సైల్ ప్రత్యేకత. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫేరింగ్ రేంజ్‌లో ఈ మిస్సైల్‌ను పరీక్షించారు. మిస్సైల్ పరీక్ష విజయవంతం కావడం, మిస్సైల్ లక్ష్యాల్ని కేంద్ర రక్షణశాఖ(Union Defence Ministry)వెల్లడించింది.
ఈ మధ్యకాలంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాల్లో ఇది మూడవదని కేంద్ర రక్షణశాఖ వెల్లడించింది. దేశీయంగా ఉన్న రక్షణ సామర్ధ్యాల్ని బలోపేతం చేసేందుకు సాంట్ మిస్సైల్ పరీక్ష విజయవం కావడం చాలా దోహదపడనుంది.ఈ మిస్సైల్ హెలీకాప్టర్(Helicopter Launched Missile) నుంచి పది కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాల్ని ఛేదించగలదు. మిస్సైల్ రిలీజ్ మెకానిజం, గైడెన్స్, ట్రాకింగ్, అంతర్గత సాఫ్ట్‌వేర్ అన్నీ సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు రక్షణశాఖ తెలిపింది. ప్రాజెక్టు విజయవంతమవడంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh)పరిశోధనా బృందాల్ని అభినందించారు. హైదరాబాద్ ఆర్‌సీఐలో ఈ మిస్సైల్ డిజైన్ జరిగింది.
Also read: ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఎక్కౌంట్ హ్యాక్, అనుమానాస్పద ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook