గత ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ నిర్వహించిన పాపులర్ క్యాంపెయిన్ 'చాయ్ పే చర్చా'. ఈసారి అదే తరహాలో కమలనాథులు 'లంచ్ పే చర్చా' నిర్వహించాలని యోచిస్తునట్లు సమాచారం. బీజేపీ తమ పథకాలను గ్రామ స్థాయిలో జనంలోకి  తీసుకొని వెళ్లడానికి ఈ తరహా క్యాంపెయిన్ చేయాలని అనుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పార్లమెంట్‌ బడ్జెట్‌ తొలి విడత సమావేశాలు ముగిశాక, శుక్రవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన మోదీ.. ఎంపీల ప్రచారం మీదే 2019లో పార్టీ విజయం ఆధారపడి ఉంటుందన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ‘లంచ్‌ పే చర్చా’ పేరిట బడ్జెట్‌లో పేర్కొన్న పథకాలను జనంలోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని పార్టీ నేతలకు మోదీ సూచించారు.


'లంచ్ పే చర్చా'లో భాగంగా ప్రతీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గంలో మధ్యాహ్న భోజన సమయంలో సమావేశాలు నిర్వహించాలి. ప్రజాప్రతినిధులు ఎవరికి వారే భోజనం తీసుకెళ్లాలి. బిజేపీపై వస్తున్న ఆరోపణలకు గట్టిగా సమాధానం ఇవ్వాలి. కేంద్ర బడ్జెట్ రైతులకు, మధ్య తరగతివారికి అనుకూలంగా ఉందని చెప్పాలి. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తృతంగా జనంలోకి తీసికెళ్లాలి' అని మోదీ ఎంపీలకు సూచించారు.