PM Modi Speech Highlights: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ నేత గౌరవ్ గొగొయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గత రెండు రోజులుగా పార్లమెంట్ సమావేశాల్లో తీవ్ర రభస జరుగుతున్న విషయం తెలిసిందే. మణిపూర్ లో విధ్వంసం, హింస నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ నేడు పార్లమెంట్ సమావేశాల్లో స్పందించారు. అవిశ్వాస తీర్మానంపై తన సమాధానంగా సుదీర్థ ప్రసంగం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రసంగం ఆద్యంతం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పలు సందర్భాల్లో ఛలోక్తులు విసురుతూనే కాంగ్రెస్ పార్టీని దారుణంగా ఎద్దేవా చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడం తమ ప్రభుత్వానికి శుభ పరిణామమే అవుతుంది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తోంటే.. వాళ్లు దేశం గురించి ఆందోళన చెందుతున్నట్టుగా లేదు.. భారత్ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నట్టుగా లేదు.. ఇదంతా వాళ్ల రాజకీయ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నట్టుగా కనిపిస్తోంది అని సెటైర్లు వేశారు. 


ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలోంచి ముఖ్యాంశాలు
భారత్‌ను అవమానించడం కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో సంతోషం - ప్రధాని మోదీ
కాంగ్రెస్‌ పార్టీ భారత్ ని అవమానించడంలో ఆనందం" పొందుతోంది అని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతీ చిన్న విషయంలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి దేశం పరువు తీస్తోందన్నారు. రాహుల్ గాంధీ బుధవారం నాటి ప్రసంగంలో భరతమాత గురించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కొంతమంది భరతమాతను అంతం చేయాలని ఎందుకు ఊహించుకుంటారో కూడా అర్థం కావడం లేదు అని ప్రధాని మోదీ విస్మయం వ్యక్తంచేశారు. 


భారత సైన్యంపైనా కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదు - ప్రధాని మోదీ
ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న భారత సైన్యాన్ని కాంగ్రెస్ పార్టీ విశ్వసించడం లేదు అని ప్రధాని మోదీ మండిపడ్డారు.


2028 లోనూ ప్రతిపక్షం మరో అవిశ్వాస తీర్మానం పెడుతుందని ప్రధాని మోదీ సెటైర్లు
వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ తామే గెలిచి అధికారంలోకి వస్తామని పరోక్షంగా హింట్ ఇచ్చిన ప్రధాని మోదీ.. 2028 లో ప్రతిపక్షాలు మరోసారి అవిశ్వాస తీర్మానం పెడతాయని ఎద్దేవా చేశారు. ఇప్పుడున్న ప్రతిపక్షం మరోసారి ప్రతిపక్షం పాత్రకే పరిమితం అవుతుంది అని ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలతో చెప్పకనే చెప్పారు. 


1962 తర్వాత తమిళనాడు ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీపై విశ్వాసం పోయింది
తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ చివరిసారిగా 1962లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిందని.. ఇక అప్పటి నుంచి ఆ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పోయిందని అన్నారు.


కాంగ్రెస్‌పై భారత్‌కు విశ్వాసం లేదన్న ప్రధాని మోదీ
కాంగ్రెస్‌ పార్టీపై భారత ప్రజలకు విశ్వాసం లేదని పార్లమెంట్‌లో తన ప్రసంగం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టంచేశారు.


షూట్ అండ్ స్కూట్ - విపక్షాలు వాకౌట్ పై ప్రధాని మోదీ ఆగ్రహం
అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ స్పందించే సమయంలో ప్రతిపక్షాల సభ్యులు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో విపక్షాల తీరుపై ప్రధాని మోదీ తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. " ప్రశ్నలు లేవనెత్తే వారికి సమాధానాలు వినే ధైర్యం లేదని.. వాళ్లు షూట్ చేసి పక్కకు తప్పుకుంటారు అని ఎద్దేవా చేశారు.


ఇది కూడా చదవండి : Flying Kisses: రాహుల్ గాంధీ చుట్టూ మరో వివాదం, ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చిందెవరికి


మణిపూర్ కొత్త విశ్వాసంతో ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తంచేసిన ప్రధాని మోదీ
మణిపూర్ లో హింస నేపథ్యంలోనే వచ్చిన ఈ అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. మణిపూర్‌ ఇకపై కొత్త ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతుంది అని ధీమా వ్యక్తంచేశారు. మణిపూర్ వయోలెన్స్ అంశం ప్రస్తుతం కోర్టులో ఉందని, త్వరలోనే రాష్ట్రంలో శాంతి నెలకొంటుంది అని అభిప్రాయపడ్డారు. మణిపూర్‌లో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతుంది అని మణిపూర్ ప్రజలకు ప్రధాని మోదీ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.


ఇది కూడా చదవండి : Manipur incident: మణిపూర్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి