Flying Kisses: రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రసంగం అనంతం వెళ్తూ వెళ్తూ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం ఇప్పుడు కొత్త వివాదానికి కారణమౌతుంది. ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం మహిళలల్ని అగౌరవపర్చడమని అధికార పక్షం దుమ్మెత్తిపోస్తోంది. లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ లోక్‌సభలో హాట్ హాట్‌గా వాదనలు కొనసాగాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మణిపూర్ ను మాత్రమే హత్య చేయలేదని, మణిపూర్‌లో భారతమాత హత్య జరిగిందని రాహుల్ గాంధీ తెలిపారు. ఇప్పటికీ మణిపూర్ సందర్శించని ప్రదాని మోదీకు మణిపూర్ దేశంలో అంతర్బాగంగా కన్పించడం లేదన్నారు. ఆ తరువాత హోంమంత్రి అమిత్ షా పలు అంశాలకు వివరణ ఇచ్చారు. మణిపూర్ ఘటనలు అత్యంత దారుణమని..వాటిని రాజకీయం చేయడం ఇంకా ప్రమాదకరమన్నాడు. మణిపూర్ అంశంపై ఓ వైపు అధికార ప్రతిపక్షాల మద్య వాదన జరుగుతుండగా..కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ చుట్టు మరో వివాదం ఇరుక్కుంటుందా అనే అనుమానాలు వస్తున్నాయి.
అవిశ్వాసంపై మాట్లాడి లోక్‌సభ నుంచి వెళ్లిపోతూ..తామున్నవైపు చూపిస్తూ ఫ్లయింగ్ కిసి ఇచ్చాడనేది రాహుల్ గాంధీపై ఉన్న ప్రధాన ఆరోపణ. అంతటితో ఆగకుండా కొందరు మహిళా ఎంపీలతో కలిసి ఆమె లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు కూడా చేశారు. మహిళల పట్ల ఇలాంటి వ్యవహారం ఇప్పటి వరకూ ఎవరూ చేయలేదని ఫిర్యాదు చేశారు. మహిళలు కూర్చున్నవైపు చూపించి ఫ్లయింగ్ కిస్ వదిలారంటే మహిళలపై ఆయనకు ఉన్న గౌరవం ఏపాటిదో తెలుస్తుందన్నారు.
అయితే ఫ్లయింగ్ కిస్ ఆరోపణల్ని కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. తమ నేత రాహుల్ గాంధీ ట్రెజరీ బెంచ్‌ల వైపు చూపించి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారన్నారు. స్మృతి ఇరానీ ఆరోపిస్తున్నట్టుగా ఆమె వైపుకో లేదా బీజేపీ ఎంపీల వైపుకో తిరిగి ఫ్లయింగ్ కిస్ ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నారు.
Also read: Independence Day 2023: ఆగస్టు 15నే స్వాతంత్య్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం, నేపధ్యమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook