Marriage Age: అమ్మాయిల కనీస వివాహ వయస్సు ఎంత ఉండబోతోంది?
దేశంలో త్వరలో అమ్మాయిల కనీస వివాహ వయస్సులో మార్పు రాబోతోంది. కమిటీ నివేదికల అనంతరం త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నామని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
దేశంలో త్వరలో అమ్మాయిల కనీస వివాహ వయస్సు ( Change in Girls minimum Age of marriage ) లో మార్పు రాబోతోంది. కమిటీ నివేదికల అనంతరం త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నామని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ప్రస్తుతం దేశంలో అమ్మాయిలకు , అబ్బాయిలకు కనీస వివాహ వయస్సును 18-21 సంవత్సరాలుగా నిర్దారించారు. అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్ల నిండనిదే వివాహానికి అనర్హులనేది చట్టం చెబుతున్నమాట. ఈ నిర్ణీత వయస్సు దాటితే తల్లిదండ్రుల ప్రమేయం లేకపోయినా అమ్మాయిలు, అబ్బాయిలు వివాహం చేసుకోవచ్చు. అబ్బాయిలపై కనీస వివాహ వయస్సు కంటే అమ్మాయిలకు నిర్ణయించిన కనీస వివాహ వయస్సులో మార్పు రావాలనేది చాలా కాలం నుంచి పెండింగులో ఉన్న అంశం. ఈ అంశంపై ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( prime minister narendra modi ) స్పష్టత ఇచ్చారు.
అమ్మాయిల కనీస వివాహా వయస్సు ఎంత ఉండాలనే దానిపై ఇప్పటికే కమిటీలు వేశామని..అ కమిటీల నివేదికలు అందిన తరువాత దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రదాని మోదీ స్పష్టం చేశారు. అయితే కమిటీలు ఇప్పటివరకూ నివేదిక ఎందుకివ్వలేదంటూ ఆడబిడ్డలు తనను ప్రశ్నిస్తున్నారని మోదీ చెప్పారు. నిపుణుల కమిటీ ( Experts committee ) నివేదిక వచ్చిన వెంటనే సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామన్నారు.
దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో బాలుర కంటే బాలికలదే పైచేయి ఉంటోందని...గత ఆరేళ్లుగా తాము చేస్తున్న కృషి ఫలితంగా ఈ మార్పు వచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. శానిటరీ ప్యాడ్ లను కేవలం ఒక్క రూపాయికే అమ్మాయిలకు అందిస్తున్న సంగతి మోదీ గుర్తు చేశారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని ప్రసంగంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సు ప్రస్తావన వచ్చింది. అప్పట్నించి దేశమంతా ఈ విషయంపై ఆసక్తి చూపిస్తోంది. Also read: International Flights: 17 దేశాలకు వెళ్లేందుకు పౌరవిమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్, వివరాలు ఇవే!