శ్రీశైలం విద్యుత్ కేంద్రం ( Srisailam power plant ) లో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ విద్యుత్ కేంద్రం( Srisailam left canal power plant ) లో జరిగిన  ఘోర అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయారు. రక్షించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సొరంగంలో దట్టమైన పొగలు  వ్యాపించడంతో ఊపిరాడక చనిపోయినట్టుగా తెలుస్తోంది. జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Pm modi tweets ) స్పందించారు. శ్రీశైలం ఘటన అత్యంత దురదృష్టకరమని ప్రదాని మోదీ ట్వీట్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అటు గాయపడి చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.



ఇప్పటికే ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ( Telangana cm kcr ) సీఐడీ విచారణకు ఆదేశించారు. అగ్ని ప్రమాదానికి కారణాలు, దారి తీసిన పరిస్థితుల్ని వెలికి తీయాలని సూచించారు. Also read: Ganesh Chaturthi: వ్యక్తిగత నిమజ్జనాలకు ఓకే..ఊరేగింపులకు నో