Ganesh Chaturthi: వ్యక్తిగత నిమజ్జనాలకు ఓకే..ఊరేగింపులకు నో

తమిళనాట గణేష్ నిమజ్జనానికి ( Genesh immersion ) మద్రాస్ హైకోర్టు ( Madras High court ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేస్తూనే కొన్ని మార్పులు చేసింది. ఊరేగింపులు, ఉత్సవాలకు నో చెబుతూ..వ్యక్తిగత నిమజ్జనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోర్టు. 

Last Updated : Aug 22, 2020, 02:17 PM IST
Ganesh Chaturthi: వ్యక్తిగత నిమజ్జనాలకు ఓకే..ఊరేగింపులకు నో

తమిళనాట గణేష్ నిమజ్జనానికి ( Genesh immersion ) మద్రాస్ హైకోర్టు ( Madras High court ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేస్తూనే కొన్ని మార్పులు చేసింది. ఊరేగింపులు, ఉత్సవాలకు నో చెబుతూ..వ్యక్తిగత నిమజ్జనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోర్టు.  

కోవిడ్ 19 మహమ్మారి ( Covid 19 pandemic ) నేపధ్యంలో సామూహిక ఉత్సవాలు, ఊరేగింపులతో సంక్రమణ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని  తమిళనాడు ప్రభుత్వం ( Tamilnadu government ban on Ganesh nimajjanam ) గణేష్ నిమజ్జనాన్ని నిషేధించింది రాష్ట్రంలో. దీన్ని సవాలు చేస్తూ కొన్ని సంస్థలు మద్రాస్ హైకోర్టును ( Madras high court ) ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఎం సుందరేశన్, జస్టిస్ హేమలతల బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అనాదిగా వస్తున్న మతపరమైన సాంప్రదాయాల నుంచి ప్రజల్ని నిషేధించడం మంచిది కాదని అభిప్రాయపడింది. అదే సందర్భంలో ప్రభుత్వ ఉత్తర్వుల్లో మార్పులు చేసి తీర్పు ఇచ్చింది. వ్యక్తిగతంగా ఎవరికివారు గణేష్ విగ్రహ స్థాపన గానీ, నిమజ్జనం గానీ చేసుకోవచ్చని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఊరేగింపులు, ఉత్సవాలకు మాత్రం ఏ సంస్థలకు అనుమతి లేదని వెల్లడించింది.

అయితే వ్యక్తిగతంగా నిమజ్జనం చేసుకునేటప్పుడు సైతం కోవిడ్ నిబంధనల్ని పూర్తిగా పాటించాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వుల్ని ఛాలెంజ్ చేస్తూ హిందూ మున్నాని, శివసేనలు దాఖలు చేసిన పిటీషన్ పై ఈ విచారణ జరిగింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం విగ్రహ స్థాపన, నిమజ్జనం రెండూ  చవితినాడే జరుపుతామని హిందూ మున్నాని సంస్థ ప్రకటించింది. కోర్టు ఆదేశాల ప్రకారం తమిళనాడులో ప్రజల భాగస్వామ్యం లేకుండా ఎవరికివారు వ్యక్తిగతంగా ఇళ్లలోనూ, ప్రైవేట్ ప్రదేశాల్లోనూ గణేశుని స్థాపన, నిమజ్జనం ఒకేరోజు చేసుకోవల్సి ఉంటుంది. 

Also read: Lalu Prasad Yadav: లాలూ సెక్యూరిటీలో 9 మందికి కరోనా

Trending News