PM Modi unveils 108-feet statue of Hanuman in Gujarat: హనుమాన్ జయంతి (Hanuman Jayanti 2022) సందర్భంగా గుజరాత్‌లోని మోర్బీలో 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. హనుమాన్ జీ 4 ధామ్ ప్రాజెక్టులో భాగంగా..దేశ నలుదిక్కుల్లో నాలుగు హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ పథకంలోని రెండో విగ్రహాన్ని ప్రధాని మోదీ ఇవాళ ఆవిష్కరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరికొన్ని రోజుల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విగ్రహాన్ని (Hanuman Statue) ఆనిష్కరించటం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా.. ఏప్రిల్ 18న ప్రధాని మోదీ గుజరాత్ (Gujrat)లో పర్యటించనున్నారు. మెుదట హనుమాన్ విగ్రహాన్ని 2010లో ఉత్తరాన ఉన్న సిమ్లాలో ఏర్పాటు చేశారు. రెండో విగ్రహాన్ని దేశానికి పడమర దిక్కున ఉన్న మోర్బీలోని బాపూ కేశవానంద్ ఆశ్రమంలో నెలకొల్పగా..తాజాగా దానిని మోదీ ప్రారంభించారు. ఆలాగే దక్షిణ దిక్కుకు సంబంధించి తమిళనాడులోని రామేశ్వరంలో విగ్రహా ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రారంభించారు. 


Also Read: New Ticket Booking Rules: టికెట్ బుకింగ్‌లో కొత్త మార్పులు, ఇప్పుడది అవసరం లేదట


హనుమాన్ జయంతిని పురస్కరించుకుని... ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హనుమంతుడి దయతో ప్రతి ఒక్కరి జీవితాలు బాగుండాలని మోదీ ఆశించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Facebook , Twitterమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి