PM Modi New Shakes the Internet: కర్ణాటకలోని చామరాజనగర్ లో ఉన్న బందీపూర్ టైగర్ రిజర్వ్‌ను ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. ఆయన తన లుక్ ను పూర్తిగా మార్చేశారు. సఫారీ దుస్తులు, టోఫీ ధరించి డిఫరెంట్ లుక్‌లో సందడి చేశారు. ఫారెస్ట్ వెహికల్ లో టైగర్ రిజర్వ్ అంతా తిరిగారు. 1973లో ప్రారంభించిన ప్రాజెక్టు టైగర్ 50 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేయనున్న పలు కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బందీఫూర్ టైగర్ రిజర్వులోని కొంత భాగం చామరాజనగర్ జిల్లాలోనూ, మరికొంత భాగం మైసూరు జిల్లాలోనూ విస్తరించి ఉంది. ప్రస్తుతం ఈ టైగర్ రిజర్వ్ 912 చదరుపు కిలోమీటర్ల విస్తరించిఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 54 టైగర్ రిజర్వులు ఉన్నాయి. చివరిగా ఉత్తరప్రదేశ్ లోని రాణీపూర్ టైగర్ రిజర్వును గుర్తించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మెుత్తం 2,967 పులులు ఉన్నాయి. 



Also Read: Good news: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యాహ్నం 2 గంటల వరకే పని..!


ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం దక్షిణాదికి వచ్చారు. ఆయన తమిళనాడు, తెంలగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. నిన్న ఆయన తెలంగాణలోని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించారు. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా మోదీ ప్రారంభించారు. 


Also Read: Droupadi Murmu: తొలిసారి సుఖోయ్ విమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి