Droupadi Murmu: తొలిసారి సుఖోయ్ విమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి సుఖోయ్‌-30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించారు. ప్రతిభా పాటిల్ తర్వాత యుద్ధ విమానంలో ప్రయాణించిన రెండో మహిళ రాష్ట్రపతి ముర్ము.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2023, 02:46 PM IST
Droupadi Murmu: తొలిసారి సుఖోయ్ విమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu Assam tour: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తుతం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో సుఖోయ్ 30 ఎమ్‌కెఐ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించారు. ముర్ము సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించడం ఇదే తొలిసారి. ఈ విమానాన్ని గ్రూప్‌ కెప్టెన్‌ నవీన్‌ కుమార్‌ తివారీ నడిపారు. 

భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ అయిన రాష్ట్రపతి ముర్ము.. బ్రహ్మపుత్ర మరియు తేజ్‌పూర్ లోయలను కవర్ చేస్తూ సుమారు 30 నిమిషాల పాటు విమానంలో ప్రయాణించారు. ఏపీజే అబ్దుల్ కలాం మరియు ప్రతిభా పాటిల్ తర్వాత యుద్ధ విమానంలో ప్రయాణించిన మూడవ రాష్ట్రపతి, రెండో మహిళ ప్రెసిడెంట్ ముర్ము. గతంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 2009లో ఫ్రంట్‌లైన్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించారు. 

మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఏప్రిల్ 06న అస్సాం చేరుకున్నారు. ఏప్రిల్ 7, శుక్రవారం నాడు ముర్ము కజిరంగా నేషనల్ పార్క్‌లో గజ్ ఉత్సవ్-2023ని ప్రారంభించారు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 30 సంవత్సరాలు పూర్తిచేస్తుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్న డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ గురించి ఆమె మాట్లాడారు. అనంతరం గౌహతి హైకోర్టు యొక్క 75 సంవత్సరాల వేడుకల్లో కూడా ముర్ము పాల్గొన్నారు. అంతేకాకుండా గౌహతిలో మౌంట్ కాంచన్‌జంగా సాహసయాత్ర-2023ని కూడా జెండా ఊపి ప్రారంభించారు.

Also Read: Covid-19 Cases In India: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ రెండు రోజులు మాక్‌డ్రిల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News