మోదీ భార్యకు గాయాలు; ఒకరు మృతి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ భార్య జసోదాబెన్‌కు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ భార్య జసోదాబెన్‌కు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా.. మోదీ భార్య తలకు బలమైన గాయం తగిలింది. ఈ ప్రమాదం రాజస్థాన్‌లోని కోట-చిత్తోర్ ఘర్ జాతీయ రహదారిపై జరిగింది.
జసోదాబెన్ చిత్తోర్‌ఘర్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని నివేదికలు అందాయి.
ప్రస్తుతం జసోదాబెన్‌ను చిత్తోర్‌ఘర్‌లోని ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన తరువాత, ఆగ్రా పోలీసు అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.