PM Narendra Modi appeal to farmers: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm laws ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన ( Farmer Agitation ) చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విడుదల చేసిన లేఖను రైతులందరూ చదవాలని ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ ఎనిమిది పేజీల లేఖ అందేలా చేయాలని ఆయన మోదీ కోరారు. ఈ బహిరంగ లేఖ ద్వారా తోమర్.. రైతులతో మర్యాదపూర్వక సంభాషణ జరపడానికి చేసిన ప్రయత్నాన్ని ప్రధాని మోదీ ప్రశంసింస్తూ ట్విట్ చేశారు. Also read; Farmer protests: వ్యవసాయ చట్టాల ప్రతులను చింపేసిన సీఎం కేజ్రీవాల్



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ అన్నదాతలు చేస్తున్న ఆందోళనలు 24 రోజుకు చేరాయి. ఈ క్రమంలో గురువారం కనీస మద్దతు ధర (MSP) పై రాత పూర్వకంగా హామీ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ.. రైతు సంఘాల నేతలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ (Narendra Singh Tomar) ఎనిమిది పేజీల లేఖ రాశారు. కొంతమంది ఎంఎస్పీపై వివరణ ఇవ్వాలని కోరుతున్నారని అందుకే లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలపై ( Farm Bills ) కాంగ్రెస్, వామపక్షాలు, పలు ప్రతిపక్ష పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని నరేంద్ర సింగ్ తోమర్ ఆరోపించారు. రైతుల లబ్ధి కోసమే ఈ చట్టాలను తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. 


Also read: Farmer protests: సిక్కు మతగురువు ఆత్మహత్య


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook