PM Modi's speech on Coronavirus second wave: ఢిల్లీ : ఎంతో తప్పనిసరైతే కానీ జనం ఇల్లు వీడి బయటకు రావొద్దని ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్‌డౌన్‌ను (Lockdown) తప్పనిసరి పరిస్థితుల్లో చివ‌రి అస్త్రంగానే ప్రయోగించాల్సి ఉంటుందని ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ప్ర‌స్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు మనం మన ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంది అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ తయారీ సంస్థ‌ల‌తో స‌మావేశమై చర్చించిన అనంత‌రం దేశంలో కొవిడ్-19 ప‌రిస్థితుల‌పై జాతిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ ప్ర‌ధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ.. క‌రోనా సెకండ్ వేవ్ (Corona second wave) ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని, కరోనా విజృంభిస్తోందని అన్నారు. వైద్య సిబ్బందికి సెల్యూట్ చేస్తున్న‌ట్లు చెప్పిన ప్రధాని మోదీ.. వారు కరోనా రోగులకు చేస్తున్న సేవను కొనియాడారు. కరోనా సంక్షోభాన్ని ప‌రిష్క‌రించేందుకు తీవ్ర కృషి జరుగుతున్నట్టు చెప్పిన ప్రధాని.. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పాటు ప్రైవేట్ రంగం ఆ కృషిలో భాగస్వామి అవుతోందని అన్నారు.


Also read : Corona Second Wave: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు, ఆందోళనకరంగా పరిస్థితి


ధైర్యం, స్వీయ క్ర‌మ‌శిక్ష‌ణ‌తోనే మనం ఈ కరోనాను ధీటుగా ఎదుర్కొనగలం అని సూచించిన ప్రధాని మోదీ.. ఆక్సిజ‌న్‌ (Oxygen suppliers contacts) అవసరమైన ప్రతి ఒక్కరికీ ఆక్సీజన్‌ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే పేరున్న మెడిసిన్‌ తయారీ సంస్థలు మన దేశంలో ఉన్న‌ట్లు తెలిపిన ప్ర‌ధాని ఫార్మా కంపెనీలు కూడా అవసరాలకు అనుగుణంగా ఔషధాల ఉత్పత్తిని పెంచాయ‌ని గుర్తుచేశారు. 


18 ప్లస్ ఏజ్ గ్రూప్ వారికి కొవిడ్-19 వ్యాక్సిన్ (COVID-19 vaccine for 18+ age group):
ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చాకా ఇప్పటివరకు అత్యధిక మందికి కరోనా వ్యాక్సిన్స్ ఇచ్చిన దేశాల్లో మన దేశమే ముందంజలో ఉందని స్పష్టంచేసిన ప్రధాని మోదీ.. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు, వయోవృద్ధులకు తొలి ప్రాధాన్యత కింద వ్యాక్సిన్స్ వేసిన‌ట్లు తెలిపారు. ఆ తర్వాతి దశలో 45 ఏళ్లకు పైన వయస్సు ఉన్న వారికి వ్యాక్సిన్ ఇవ్వడం మొదలుపెట్టాం. ఇక మే 1వ తేదీ నుంచి 18 ప్లస్ ఏజ్ గ్రూప్ వారికి కూడా కొవిడ్-19 వ్యాక్సిన్ (Corona vaccine for 18+ age group) ఇవ్వనున్న‌ట్లు ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు.


Also read : 7th Pay Commission Latest News: 28 శాతానికి పెరగనున్న DA, జూలై నుంచి ఉద్యోగులకు సవరించిన వేతనాలు


ప్రజలు సహకరిస్తే లాక్‌డౌన్‌తో పనిలేదు (Save the nation from lockdown):
కరోనాను నివారించేందుకు జరుగుతున్న పోరాటంలో ప్రజలు కూడా భాగస్వాములై సహకరిస్తే తప్పకుండా విజయం సాధిస్తామని, అప్పుడు లాక్‌డౌన్ (Lockdown in India) విధించాల్సిన అవసరం కూడా ఏర్పడదని ప్రధాని మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. కరోనాపై పోరాటంలో యువత కీలక పాత్ర పోషించాల్సిందిగా ప్రధాని మోదీ కోరారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook