Corona Second Wave: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు, ఆందోళనకరంగా మారుతున్న పరిస్థితి

Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ దెబ్బ గట్టిగా తగులుతోంది. దేశవ్యాప్తంగా ప్రజలు విలవిలలాడుతున్నారు. లాక్‌డౌన్ తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గత 24 గంటల్లో ఏపీలో ఎన్ని కొత్త కేసులు నమోదయ్యాయంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 20, 2021, 07:21 PM IST
Corona Second Wave: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు, ఆందోళనకరంగా మారుతున్న పరిస్థితి

Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ దెబ్బ గట్టిగా తగులుతోంది. దేశవ్యాప్తంగా ప్రజలు విలవిలలాడుతున్నారు. లాక్‌డౌన్ తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గత 24 గంటల్లో ఏపీలో ఎన్ని కొత్త కేసులు నమోదయ్యాయంటే..

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) పంజా విసురుతున్నట్టే తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు చోట్లా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 37 వేల 922 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు ( Covid 19 Tests) చేయగా..8 వేల 987 మందికి పాజిటివ్‌గా ( Ap coronavirus cases) నిర్ధారణైంది. ఇటీవలి కాలంలో ఏపీలో ఇదే అత్యధికం. మరోవైపు కరోనా కారణంగా గత 24 గంటల్లో 35 మంది మృత్యువాత పడగా..3 వే 116 మంది కోలుకున్నారు.ఇప్పటి వరకూ రాష్ట్రంలో 9 లక్షల 15 వేల 626 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 53 వేల 889 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో ఇప్పటి వరకూ  1 కోటి 57 లక్షల 53 వ ేల 679 మందికి కరోనా పరీక్షలు చేశారు. 

మరోవైపు తెలంగాణ(Telangana)లో కేసుల తీవ్రత దృష్టిలో ఉంచుకుని నైట్‌కర్ఫ్యూ(NIght Curfew) విధించారు. నగరవాసులు నైట్‌కర్ఫ్యూని విధింగా పాటించాలని రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ కోరారు. గత 24 గంటల్లో తెలంగాణలో 5 వేల 9 వందల కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో విధించిన కర్ఫ్యూ ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. కర్ఫ్యూ అమలు కోసం నగరంలో 46 చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు

Also read: Polavaram lift irrigation: పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానంగా మరో ఎత్తిపోతల పథకం, ప్రభుత్వం అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News