Partition Day: దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. నాటి విభజనను గుర్తు చేసుకున్నారు. ఆగస్టు 14 వ తేదీను ఇకపై విభజన కష్టాల స్మృతి దినోత్సవంగా జరుపుకోవాలని పులుపునిచ్చారు. కారణమేంటంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1947 ఆగస్టు 14. దేశ స్వాతంత్య్రానికి (Independence Day)ఒకరోజు ముందు. పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడిన రోజు. రేపు భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లవుతుంది. ఈ సందర్బంగా ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ (Narendra modi)కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 14వ తేదీను ఇక నుంచి విభజన కష్టాల స్మృతి దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఇండియా-పాకిస్తాన్ విభజన సందర్బంగా అప్పట్లో ప్రజలు పడిన బాధల్ని, కష్టాల్ని ఎన్నటికీ మర్చిపోలేమని గుర్తు చేసుకున్నారు. ట్విట్టర్ వేదికగా ఆగస్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్‌గా(August 14 as Partition Day)నిర్వహించాలన్నారు. నాడు విభజన సమయంలో ప్రజల త్యాగాల్ని స్మరించుకుంటూ ఈ దివస్ జరుపుకోవాలన్నారు. లక్షలాదిమంది సోదర సోదరీమణులు విడిపోవల్సి వచ్చిందన్నారు. అప్పటి ద్వేషం, హింస కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోయారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దేశ విభజన కష్టాల్ని ఎప్పటికీ మర్చిపోలేమని...ప్రజల పోరాటం, త్యాగాలు గుర్తు చేసుకోవాలన్నారు. సామాజిక విబేధాలు, అసమానతలనే విషాన్ని తొలగించడంతో పాటు ఏకత్వం, సామాజిక సామరస్యం, మానవ సాధికారత స్పూర్తిని మరింతగా బలోపేతం చేయాలన్నారు.


Also read; ట్విట్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ, ట్విట్టర్ రాజకీయాలు చేస్తోందట


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook