Narendra Modi: భోగి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి.
PM Narendra Modi extends Bhogi greetings to everyone | న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. చిన్నా, పెద్దా అందరూ కలిసి భోగి మంటలు వేసి ఆనందోత్సాహాంతో పండుగను (Bhogi) జరుపుకుంటున్నారు. భోగి పండుగను పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ప్రధాని ట్విట్ చేశారు.
‘‘అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక రోజు.. అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను’’ అంటూ ప్రధాని మోదీ ట్విట్ చేశారు. ఈ మేరకు ఆయన ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ట్విట్ చేశారు. Also Read: Farm Laws: కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే
రాష్ట్రపతి సంక్రాంతి శుభాకాంక్షలు..
ఇదిలాఉంటే.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా దేశ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశ పౌరులందరికీ లోహ్రీ, మకర సంక్రాంతి, పొంగల్, భోగాలి బిహు, ఉత్తరాయణ్, పౌష్ పర్వ శుభాకాంక్షలు.. దేశంలో భోగభాగ్యాలను, సుఖ సంతోషాలను పెంపొందించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) తన ప్రకటనలో పేర్కొన్నారు. Also Read: Pongal 2021 సంక్రాంతి ఆ రాష్ట్రాల్లోనూ ప్రత్యేకమే.. అక్కడా సెలబ్రేషన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook