PM Narendra Modi to flag off 8 trains | న్యూఢిల్లీ: ప‌్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ కొత్త‌గా ఎనిమిది రైళ్ల‌ను ప్రారంభించారు. ఆదివారం వర్చువల్ ద్వారా జరిగిన కార్య‌క్ర‌మంలో ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ఈ రైళ్లను ప్రారంభించారు. మోదీతోపాటు ఈ కార్య‌క్ర‌మంలో గుజ‌రాత్ సీఎం విజ‌య్ రూపానీ, కేంద్ర రైల్వేశాఖ (Indian Railways) మంత్రి పీయూష్ గోయ‌ల్‌ కూడా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అయితే కొత్త‌గా ప్రారంభ‌మైన ఈ రైళ్లు గు‌జ‌రాత్‌ (Gujarat) లోని ‌కెవాడియా ప‌ట్ట‌ణం నుంచి దేశంలోని ఎనిమిది ప్రాంతాల‌కు రాక‌పోక‌లు సాగించ‌నున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుజ‌రాత్‌లోని కెవాడియా ప‌ట్ట‌ణం ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌యిన స్టాట్యూ ఆఫ్ యూనిటీకి హోమ్‌టౌన్‌గా ప్రసిద్ధి చెందింది. భారత తొలి హోంమంత్రి స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ 143వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాని మోదీ.. 2018 అక్టోబ‌ర్‌లో ప‌టేల్ భారీ విగ్ర‌హం స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీని నర్మదా నది ఒడ్డున, కెవాడియా పట్టణం సమీపాన ఆవిష్క‌రించారు. గుజరాత్‌లోని గిరిజ‌న ప్రాంతమైన కెవాడియా (Kevadia) లో ప‌ర్యాట‌కానికి ఊత‌మివ్వ‌డానికి, స్టాట్యూ అఫ్ లిబ‌ర్టీకి ప్ర‌పంచ న‌లుమూల‌ల నుంచి క‌నెక్టివిటీ స‌దుపాయం క‌ల్పించ‌డానికి వీలుగా ఈ రైళ్ల‌ను ప్రారంభించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ (PM Narendra Modi) పేర్కొన్నారు. దీంతో ఉపాధి, వ్యాపార అవకాశాలు లభిస్తాయని మోదీ పేర్కొన్నారు. Also Read: COVID-19 vaccination: తొలి రోజు వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం


అయితే కొత్తగా ప్రారంభ‌మైన ఈ ఎనిమిది రైళ్లు కెవాడియా-వార‌ణాసి, కెవాడియా-దాద‌ర్‌, కెవాడియా-అహ్మ‌దాబాద్‌, కెవాడియా-హ‌జ్ర‌త్‌, కెవాడియా-నిజాముద్దీన్‌, కెవాడియా-రేవా, కెవాడియా-చెన్నై, కెవాడియా-ప్ర‌తాప్‌న‌గ‌ర్ మ‌ధ్య రాక‌పోక‌లు సాగించ‌నున్నాయి.


Also Read: COVID-19 Vaccine: కోవిడ్-19 టీకా ఎవరెవరు తీసుకోకూడదు.. తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook